వైస్సార్సీపీ సీనియర్ నాయకులు వేగి మహేష్ 4వ వర్ధంతి.

వైస్సార్సీపీ సీనియర్ నాయకులు వేగి మహేష్ 4వ వర్ధంతి.
క్యాపిటల్ వాయిస్ : విశాఖపట్నం :ప్రతినిధి
వైస్సార్సీపీ సీనియర్ నాయకులు వేగి మహేష్ 4వ వర్ధంతి కార్యక్రమం వేగి మహేష్ కుమారులు వేగి నూక ఆనంద్ కుమార్, వేగి రామిరెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య అతిధిగా వైస్సార్సీపీ 7వ వార్డు అధ్యక్షులు పోతిన శ్రీనివాస్ విచ్చేసి పోతిన శ్రీనివాస్ చేతులుమీదుగా 100 మంది వృద్దులకు నిత్యఅవసర సరుకులు పంపిణీ చేసారు పోతిన శ్రీనివాస్ మాట్లాడుతూ వాంబేకాలనీ లో వైస్సార్సీపీ పార్టీ తరపున పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి,ఎవరికి ఏ కష్టం వచ్చిన పలికే వ్యక్తి అని ఆయన అన్నారు.ఆయన మరణించి 4 సంవత్సరాలనుండి ప్రతీ వర్ధంతికి వేగి మహేష్ కి గుర్తుగా వృద్దులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ అధ్యక్షులు పోతిన శ్రీనివాస్. వైస్సార్సీపీ మహిళా నాయకులు చేకూరి రజని, వైస్సార్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.