ఎం.ఎల్ ఎ గోపిరెడ్డి ఆధ్వర్యంలో వై.యెస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు

ఎం.ఎల్ ఎ గోపిరెడ్డి ఆధ్వర్యంలో వై.యెస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు
అన్నదానం,రక్తదాన శిబిరాలు ఏర్పాటు..
మార్కెట్ యార్డ్ చైర్మన్ అబ్దుల్ హనీఫ్ ఆధ్వర్యంలో భారీ కేక్ కటింగ్
క్యాపిటల్ వాయిస్, నరసరావుపేట :- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మహానేత దివంగత డా.వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 72 వ జయంతి సందర్భంగా పట్టణంలోని పలు సేవా కార్యక్రమాలు, జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న నరసరావుపేట శాసనసభ్యులు డా.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి,సంక్షేమం,రైతు పక్షపాతి ప్రభుత్వం అంటే గుర్తొచ్చే పేరు డా.వై .ఎస్. రాజశేఖర్ రెడ్డి పాలన. అంత గొప్ప పాలన చేసి అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొంది వరుసగా రెండు మార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా బాధ్యతలు స్వీకరించి ఆరోగ్య శ్రీ,ఫీజు రీయియంబుర్స్మెంట్ ,108 &104 ,పావలా వడ్డీ వంటి మహత్తర కార్యక్రమాలకు రూపకల్పన చేసి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన మహా నాయకుడు అంతటి గొప్ప నాయకుని 72వ జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ పరిధిలో శాసనసభ్యులు డా.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు, జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.ఎమ్మెల్యే గోపిరెడ్డి హాస్పిటల్ వద్ద ఆంధ్ర ఎం.ఆర్.పి.ఎస్.వారి ఆధ్వర్యంలో 72 కేజీల భారీ కేకును కట్ చేసి వైఎస్సార్ గారి జయంతిని ఘనంగా నిర్వహించారు. అనంతరం రామిరెడ్డి పేట పాత సమితి వద్ద పట్టణంలో మొట్టమొదట నెలకొల్పిన వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తదుపరి డా.రామలింగరెడ్డి ,డా.బ్రహ్మా రెడ్డి , ఖాజావలి మాస్టారు ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేశారు.అదేవిధంగా కేర్ పబ్లిక్ స్కూల్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఏరియా వైద్యశాల నందు వైఎస్సార్ జయంతి సందర్భంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ హనీఫ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమంలో గోపిరెడ్డి పాల్గొన్నారు.పల్నాడు రోడ్డు నందు గల జి.బి.ఆర్.వైద్యశాల నందు ఆరోగ్య మిత్రలు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం నందు పాల్గొని రక్త దానం చేసిన 20 మంది ఆరోగ్యమిత్రాలను అభినందించారు. తదుపరి డా.గజ్జల బ్రహ్మారెడ్డి గారి హాస్పిటల్ నందు వైఎస్సార్ గారి చిత్రపటానికి నివాళులర్పించి కేక్ కట్ చేసి,పులిహోర పంపిణీ చేశారు.బరంపేట బై పాస్ రోడ్డు వద్ద ఉన్న వైస్సార్ గారి విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించి కేక్ కట్ చేశారు.34 వ వార్డ్ సత్తెనపల్లి రోడ్డు,వైస్సార్ సర్కిల్ వద్ద గల వైస్సార్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడ ఏర్పాటు చేసిన కేక్ కట్ చేశారు.ప్రకాష్ నగర్ రిక్షా సెంటర్ నందు వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.12 వార్డ్ షాలేం నగర్ నందు వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.11 వ వార్డ్ లోని బొల్లా బ్రహ్మనాయుడు గారి ఇంటి పక్కన ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తదుపరి కేక్ కట్ చేశారు.ఈ కార్యక్రమాల్లో నరసరావుపేట నియోజకవర్గ వైస్సార్సీపీ నాయకులు,కార్యకర్తలు, ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ పాల్గొన్నారు.