ఏడారి గా మారుతున్న ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకుందాం

ఏడారి గా మారుతున్న ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకుందాం….
కేసీఆర్ కనుసైగలో ఏపి పాలన : మేడా శ్రీనివాస్,
తెలంగాణా లో బానిసత్వం, ఏపి లో యాచకత్వం.
ఏపిలో ఆకలి చావులు,తెలంగాణాలో బానిస మరణాలు.
కేసీఆర్, జగన్ లను బ్లాక్ మెయిల్ చేస్తున్న మోది సర్కార్.
క్యాపిటల్ వాయిస్, రాజమండ్రి :- ఏపి, తెలంగాణా పాలకులును గద్దె దించుతేనే రెండు రాష్ట్రాలు ప్రగతి సాధిస్తాయని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (ఆర్పిసి)ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టి వారాంతపు సమావేశంలో ఆర్పిసి వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ సూచించారు.
ఆంధ్రప్రదేశ్ లో గల అపార ఖనిజ సంపదను, విలువైన వనరులను పాలకుల ప్రోద్బలంతో కార్పొరేట్ శక్తులు దోచుకుపోతున్నారని, ఏపిలో గల పర్యావరణాన్ని విషపూరితం చేస్తు నేల సారవంతాన్ని పిప్పు పిప్పు చేస్తున్నారని,
భూ తాపం పెరిగిపోవటం కారణంగా వాతావరణంలో తేమ శాతం కలుషితమై ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురుతున్నారని, ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆర్ధికంగాను, అనారోగ్యాలతోను తీవ్రంగా నష్ట పోతున్నారని ఆయన తీవ్ర ఆవేదన చెందారు. ఆంధ్రప్రదేశ్ లో గల ప్రతి జిల్లా బంగారపు గని వంటిదని, అభివృద్ధి కి ఎంతో అనువైనదని, రాజకీయ కాలుష్యం తో ప్రతి జిల్లా రాబందుల దోపిడికి గురైతుందని, స్థానిక మమకారం, ప్రాంతీయ అభిమానం, నిబద్దత లేని దుర్మార్గపు నేతలు విషపు కోరల్లో ఆంధ్రా అభివృద్ధి చిక్కుకుపోయిందని, చేత కాని అసమర్ధపు సన్నాసి నేతలను నేడు ఓటర్లు ఒక రక మైన మత్తులో చట్ట సభలకు పంపుతున్నారని, ఓటరు ఓటును ఆకర్షించటానికి వెయ్యని ఎత్తుగడ వుండదని,అబద్దాలకు కొదవ వుండదని, పాపాలకు అంతు వుండదని, గంజాయి మొక్కను తులసి మొక్క వలే ఖరీదైన ప్రచార మార్కెటింగ్ ద్వారా ఓటరు దృష్టి మళ్లించి ఓటు కాజేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
శ్రీకాకుళంలో ఫుడ్ ప్రోసెసింగ్ సెంటర్, విజయనగరం మాన్సాస్ సంస్థలు, విశాఖపట్నం లో లులూ గ్రూప్, ఆదానీ డేటా సెంటర్, ప్రాంక్లిన్ టెంపుల్ టన్, హెచ్ ఎస్ బి సి,విశాఖపట్నం నుండి చెన్నై పారిశ్రామిక కారిడార్, తూగో జిల్లా ఆక్వా సెంటర్, కాకినాడ పిట్రోలియం కెమికల్ కాంప్లెక్స్,పశ్చిమ గోదావరి జిల్లా పారిశ్రామిక, వ్యవసాయ అభివృద్ధి, కృష్ణాజిల్లా ఐ టి కంపెనీలు, గుంటూరు జిల్లా సింగపూర్ స్టార్తప్ కంపెనీలు, ప్రకాశం జిల్లా ఏషియన్ పేపర్ మిల్స్ పరిశ్రమలు, రామాయపట్నం మేజర్ పోర్ట్, నెల్లూరు జిల్లా విండ్ సోలార్ కంపెనీలు, చిత్తూరు జిల్లా రిలయన్స్ జియో హోలీటెక్, అమర్ రాజా, రాజ పాలయం మిల్స్, కర్నూల్ జిల్లా మెగా సీడ్ పార్క్, అనంతపురం కియా అనుబంధ సంస్థలు, కడప జిల్లా జువారి సిమెంట్, ఉక్కు పరిశ్రమ ఈ విధంగా 13 జిల్లాలు నేటి పాలకుల స్వార్థానికి అడుగంటిపోతుందని, అభివృద్ధి జరగటం లేదని ఆయన తీవ్రంగా విమర్శించారు.
అనేక పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ ఎంతగానో అనువైన ప్రదేశం అని నిర్దారించుకుని వేల కోట్ల రూపాయలతో పరిశ్రలు స్థాపనకు సిద్దపడిన సింగపూర్ కన్సార్షియం తో ఆదానీ డేటా సెంటర్ ఆంధ్ర నుండి తెలంగాణా కు, కియా అనుబంధ సంస్థలు కర్ణాటక కు, లులూ సెంటర్ కేరళా కు, అమర్ రాజా ప్లాంట్ తమిళనాడు కు తరలిపోతున్నాయని,ఆంధ్రా పాలకులు కారణంగా ఆంధ్రా కు బొచ్చు మిగిలిస్తున్నారని, తరలిపోతున్న పరిశ్రమలు తోను, అభివృద్ధి కి అవకాశం వున్న ఏపి జిల్లాల తోను ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగు పడి నిరుద్యోగ సమస్య లేని గొప్ప రాష్ట్రం గా ఆంధ్రప్రదేశ్ ఖ్యాతి గాంచునని ఆయన తెలిపారు. ఏపిలో గల పాలకులు కేసీఆర్ చేతులో కీలు బొమ్మలుగా మారారని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతే కేసీఆర్ లాగు తడిచిపోతుందని, అభివృద్ధి కి, పెట్టుబడులకు, వనరులకు ఎంతగానో అవకాశం వున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, ఆ విషయం నక్కజిత్తుల మారి అయిన కేసీఆర్ కు బాగా తెలుసునని, కూతురు కవితమ్మను గెలిపించుకోలేని కేసిఆర్ ఆంధ్రా ప్రాంతం పై విషం చిమ్మటం తగదని, ఒకప్పుడు కెసిఆర్ కు ఆంధ్రప్రదేశ్ రాజకీయ బిక్ష తో పాటు వారి కుటుంబానికి అన్నం పెట్టిన అన్నపూర్ణ వంటిదని ఆంధ్రప్రదేశ్ అని కేసీఆర్ మరిచి ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య అగ్గి రాజేస్తు రాజకీయ లబ్ది పొందాలనుకోవడం పడుపు వృత్తి వంటిదని ఆయన నేరుగా విమర్శించారు.
కేసీఆర్ పాలనలో తెలంగాణా ప్రజల జీవితాలు బానిస బ్రతుకులుగా మారాయని, కడు పేదరికం తో విలవిలలాడుతున్నారని, ప్రాణ త్యాగాలతో తెలంగాణా రాష్ట్రాన్ని సిద్దించుకున్న అమరుల కుటుంబాలు బిక్కు బిక్కు మంటున్నాయని, కేసీఆర్ పాలనలో బలిదానాలు తో సాధించుకున్న రాష్ట్ర పరిస్థితి తో అమరుల ఆత్మ గోషిస్తుందని ఆయన ఆందోళన చెందారు.
ఏపి పాలకుల పుణ్యమా అంటు పాడి పంటలకు నిలయమైన ఆంధ్రప్రదేశ్ లో రైతు కుటుంబాలు గోషిస్తున్నాయని, ప్రజలు యాచనకు బానిసలుగా మారిపోయారని, మానవ హక్కులు రోజు రోజుకు మంటగలిచి పోతున్నాయని, అత్యధిక శాతం పిల్లలు, వృద్దులు గ్రామాల్లో చిప్ప చేత్తో పట్టుకుని ఆడుకుంటున్నారని, రోజు రోజుకు ఏపి లో హక్కులు కాలరాసిపోతున్నాయని, ప్రశ్నించే గొంతును హింసిస్తున్నారని, కొన్ని పరిస్థితుల్లో చంపేస్తున్నారని, ఈ తరహా పరిస్థితులుతో ఏపిలో ప్రజలు ప్రాణ భయం తో జీవిస్తున్నారని, కొంతమంది వలసలు పోతున్నారని ఆయన తీవ్ర మనస్తాపం చెందారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాజకీయ పరిస్థితులును మోదీ సర్కార్ అనుకూలంగా మలచుకుంటుందని, కేసీఆర్,జగన్ బలహీనతలను అక్రమ సంపదల పై ఎప్పటి కప్పుడు కేంద్రం నిఘా వర్గాల ద్వారా సమాచారంను తీసుకుంటు ఇరు తెలుగు రాష్టాల ముఖ్యమంత్రులను బ్లాక్ మెయిల్ చేస్తు మన వనరులను మోది సర్కార్ రాజకీయ అవసరాలకు దారి మళ్లిస్తు తెలుగు రాష్ట్రాలకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆయన వాపోయారు.
కేసీఆర్ పాలనలో అరాచకాలు, వివాదాలు, అక్రమాలు,, దోపిడిలు, శాంతి భద్రతల సమస్యలే మిగిలిపోతాయని, అభివృద్ధి భద్రత ఆశాజనకమేనని, ఏపిలో జగన్ పాలన లో అభివృద్ధి, భద్రత అసాధ్యమని, అప్పులతో బిక్షాటనే మిగిలిపోతుందని, ఈ పాలకులను సాగనంపక పొతే రెండు తెలుగు రాష్ట్రాలు ఏడారి లా మారె ప్రమాదం వుందని ఆర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ హెచ్చిరించారు.
సభకు ఆర్పిసి జిల్లా నాయకులు కాసా రాజు అధ్యక్షత వహించారు.ఈ సమావేశంలో ఆర్పిసి సెక్యులర్స్ సర్వశ్రీ డివిఆర్ మూర్తి, పెండ్యాల కామరాజు,ఎవిల్ నరసింహారావు, దుడ్డె త్రినాధ్, ఎండి హుస్సేన్, వల్లి శ్రీనివాసరావు, దుడ్డె సురేష్,వర్ధనపు శరత్ కుమార్, వల్లి వెంకటేష్,వాడపల్లి జ్యోతిష్, గోపి శ్రీనివాసరావు, కొలిమళ్ల లక్ష్మణ్ రావు, ఎస్ కే వల్లి, గంధం దుర్గేష్,విస్సా గణేష్,పంజా రాము,తదితరులు పాల్గొనియున్నారు.