వైసిపి 6వ వార్డు వర్కింగ్ ప్రెసిడెంట్ పోతిన ప్రసాద్ జన్మదినం వేడుకలలో మెగా రక్తదాన శిభిరం.

వైసిపి 6వ వార్డు వర్కింగ్ ప్రెసిడెంట్ పోతిన ప్రసాద్ జన్మదినం వేడుకలలో మెగా రక్తదాన శిభిరం.
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం:మధురవాడ ప్రతినిధి
నిత్యం ప్రజలకు తోచిన సహాయం చేస్తూ ప్రజా అభిమానాలు పొందుతున్న డేరింగ్ అండ్ డాషింగ్ వైసిపి 6వ వార్డు వర్కింగ్ ప్రెసిడెంట్ పోతిన ప్రసాద్ జన్మదినం వేడుకలు ఘనంగా అభిమానుల మధ్య నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రసాద్ అభిమానులు పోతిన మలయ్యపాలెం లో హెచ్డీఫ్సీ బ్యాంకు ఆవరణంలో మెగా రక్తదానం శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోతిన ప్రసాద్ మాట్లాడుతూ రాజకీయంతో బేధం లేకుండా కులమతాలకు తావులేకుండా ప్రతి ఒక్కరికి తోచిన సహాయం చేయాలనే తన కోరిక అని తెలిపారు అలాగే ఎంతోమంది రక్తం లేక చావు బతుకుల మీద ఉంటున్నారని అలాంటివారి ప్రాణాలు కాపాడడానికి నా అభిమానులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ప్రసాద్ తెలిపారు. పుట్టినరోజు సందర్భంగా రక్తదానం శిబిరాన్ని ఏర్పాట్లు చేసిన అభిమానులకు ధన్యవాదాలు పోతిన. ప్రసాద్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో పవన్, తరుణ్, లక్ష్మణ్,వంశీ తదితరులు అభిమానులు పాల్గొన్నారు.