Andhra PradeshTelangana

ఖగోళంలో మరో అద్భుతం…. పరస్పరం చేరువగా శుక్రుడు, అంగారకుడు, చందమామ!

ఖగోళంలో మరో అద్భుతం…. పరస్పరం చేరువగా శుక్రుడు, అంగారకుడు, చందమామ!

క్యాపిటల్ వాయిస్, స్పెషల్ న్యూస్ :- డిల్లీ: భూమికి పొరుగునున్న శుక్ర, అంగారక గ్రహాలు ఈ నెల 13న కనువిందు చేయనున్నాయి. ఆకాశంలో ఇవి పరస్పరం చాలా దగ్గరగా కనిపించనున్నాయి. 12న ఆ గ్రహాలకు దగ్గరగా చందమామ కూడా దర్శనమిస్తుంది. ఎలాంటి సాధనాలు అవసరం లేకుండానే కంటితో ఈ ఖగోళ అద్భుతాన్ని వీక్షించొచ్చు. ఆయా గ్రహాల కక్ష్య దృష్ట్యా అరుదైన సందర్భాల్లో అవి భూమి నుంచి చూసినప్పుడు దగ్గరగా వచ్చినట్లు కనిపిస్తాయి. పరస్పరం అత్యంత దగ్గరకు వచ్చినప్పుడు అంగారకుడు, శుక్రుడు మధ్య ఎడం 0.5 డిగ్రీల మేర మాత్రమే ఉంటుంది. ఈ రెండు గ్రహాలు, చందమామ పరస్పరం దగ్గరకు వచ్చే ప్రక్రియ గురువారం నుంచే కనపడుతోంది. 13న మరింత దగ్గరగా కనిపిస్తాయఖగోళ శాస్త్రవేత్తలు వివరించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!