Tech

వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్లు – అదీ త్వరలోనే ….చూద్దామా అవేంటో !

వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్లు – అదీ త్వరలోనే ….చూద్దామా అవేంటో !

క్యాపిటల్ వాయిస్, సాంకేతిక సమాచారం :- వాట్సాప్ ప్రస్తుత టెక్నాలజీ ప్రపంచంలో ఎన్ని రకాల మెసెజింగ్ యాప్స్ ఉన్న వాట్సాప్‌కు ఉన్న ప్రత్యేకతే వేరు. అందుకే అనునిత్యం అద్భుతమైన ఫీచర్లతో అందరినీ ఆకర్షింపచేస్తోంది.
నేటి యంగ్ జనరేషన్ ఇష్టపడే సరికొత్త ఫీచర్ల ను తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే త్వరలో వాట్సాప్ వాడే యూజర్లకు మరిన్ని ఫీచర్లు తీసుకురానుంది. ఎప్పటికప్పుడు మెరుగైన ఫీచర్లను తీసుకొస్తూ.. సెక్యూరిటీ పరంగా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈసారి సీక్రెట్, సెక్యూరిటీని మరింత పటిష్టం చేసేలా కొత్త ఫీచర్లను తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది. దీని ద్వారా ఈ యాప్‌ను మరింత ఈజీగా వాడుకునే అవకాశం లభించనుంది.

వాయిస్ మెసెజ్ ట్రాన్స్‌క్రైబ్ ఫీచర్ పేరుకు తగ్గట్టుగానే మీ వాయిస్‌ని టెక్ట్స్ రూపంలో మార్చేస్తుంది. యూజర్ వాయిస్ నోట్‌ని విని.. ఆ మెసెజెస్‌లో ఆటోమేటిక్‌గా టైప్ అవుతుంది. మీ వాయిస్‌ను టెక్స్ట్ గా మార్చే కొత్త ఫీచర్ ఇది. యూజర్లు దీన్ని అవసరం ఉన్నప్పుడే వాడుకోవచ్చు. దీని కోసం ఈ ఫీచర్ ఆన్, ఆఫ్ చేసుకునేందుకు ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. దీని కోసం వాట్సాప్ సెట్టింగ్స్>చాట్‌లు>వాయిస్ మెసేజ్ ట్రాన్స్‌క్రైబ్‌లోకి వెళ్తే చాలు. ఈ ఫీచర్ యాక్సెస్ లభిస్తుంది.

వాట్సాప్ చాటింగ్ వివరాల ను ఏదైనా కొత్త ఫోన్ కొన్నప్పుడు.. పాత ఫోన్లో నుంచి కొత్త ఫోన్లోకి ఆ వివరాలన్నీ తీసుకురావాలంటే చాలా సమయం పడుతోంది. అయితే దీంతో గూగుల్ డిస్క్‌లో వాట్సాప్ చాటింగు వివరాలను బ్యాకప్ చేయొచ్చు. గూగుల్ డ్రైవ్‌కు చాట్ హిస్టరీని బ్యాకప్ చేయకుండా మరో ఆండ్రాయిడ్ డివైజ్‌కి ట్రాన్స్‌ఫర్ ఇది బాగా సహాయపడుతుంది. అతి త్వరలో ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి రానుంది.

వాట్సాప్ కమ్యూనిటీ నావిగేషన్ అని పిలిచే ఈ కొత్త ఫీచర్ లో, చాట్ లిస్టులో కనిపించే విధంగా కమ్యూనిటీ సెల్‌లోని అన్ని సబ్ గ్రూపులను విస్తరించడానికి వినియోగదారులకు అనుమతి లభించనుంది. కమ్యూనిటీ నావిగేషన్
అనేది చాట్ ట్యాబ్‌లో సులభమైన నావిగేషన్, మెరుగైన అనుభవాన్ని అందించే ఫీచర్.

వాట్సాప్ యూజర్లు కొత్తగా వచ్చే ఫీచర్‌తో ఇన్‌కమింగ్ కాల్స్‌ను సులభంగా తిరస్కరించేందుకు కొత్త ఆప్షన్ రానుంది. ఈ బటన్ క్లిక్ చేస్తే మీకు కాల్ చేసిన వారికి ఆటోమేటిక్ రిప్లై మెసేజ్ వెళ్లిపోతుంది. ఇది నార్మల్ వాయిస్ కాల్స్‌ను తిరస్కరించడం, మెసేజ్ ద్వారా రిప్లై ఇవ్వడం లాంటిదే.

వాట్సాప్ లో మరికొన్ని రోజుల్లో సైడ్ బై సైడ్ వ్యూ ఫీచర్ రానుంది. ఈ ఫీచర్ వల్ల యూజర్లు ఇప్పటికే ఉన్న చాట్లను కోల్పోకుండా చాటింగ్ మధ్య మారేందుకు సహాయపడుతుంది. ఈ ఫీచర్ కోసం వాట్సాప్ >చాట్స్ అందుబాటులోకి
రానుంది. సైడ్ బై సైడ్ వ్యూ ఫీచర్‌తో ఒకేసారి చాలా మందితో చాట్ చేయొచ్చు.. ఫోన్ మాట్లాడేటప్పుడు కూడా ఇది సహాయపడుతుంది. వాట్సాప్ సెక్యూరిటీ ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది. అందుకే ప్రైవసీ చెకప్ ఫీచర్ ద్వారా వాట్సాప్ వినియోగదారులు తమ సీక్రెట్ సెట్టింగులను మరింత మెరుగ్గా నిర్వహించడంలో సహాయపడుతుంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా యూజర్లు తమ సమాచారాన్ని ఎవరు చూడాలనే దాని పై మరింత నియంత్రణ ను అందిస్తుంది. ఇది
గోప్యతా సెట్టింగులను త్వరగా సమీక్షించడానికి కూడా యూజర్లకు అనుమతిస్తుంది.

వాట్సాప్ యూజర్లకు ఈ చాట్ లాక్ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీన్ని ఆన్ చేయడం వల్ల యూజర్ల చాట్ జాబితాలో ‘‘లాక్ చేయబడిన చాట్’ అనే కొత్త ఆప్షన్ కనిపిస్తుంది. ఈ చాట్‌ని బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ లేదా పాస్‌వర్డ్ మాత్రమే ఉపయోగించి యాక్సెస్ చేయొచ్చు. అయితే పాస్‌వర్డ్‌ని తప్పుగా నమోదు చేయడం వంటి పొరపాట్లు చేయకండి. ఒకవేళ అలా ఎక్కువ సార్లు జరిగితే మాత్రం,మీ చాట్ మొత్తం క్లియర్ అయ్యేలా ఈ ఫీచర్ పని చేయనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అందరూ గమనించి మీ మొబైల్ లో వాట్సాప్ ను అప్డేట్ చేసుకొని ఈ ఫీచర్లను ఆనందించండి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!