విశాఖ స్టీల్ ప్లాంట్ అష్టదిగ్బంధనం.. బిడ్లు ఆహ్వానంపై ఆగ్రహజ్వాలలు

విశాఖ స్టీల్ ప్లాంట్ అష్టదిగ్బంధనం.. బిడ్లు ఆహ్వానంపై ఆగ్రహజ్వాలలు
క్యాపిటల్ వాయిస్, విశాఖపట్నం జిల్లా ప్రతినిధి :- విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రాంతం ఆందోళనలతో అట్టుడుకుతుంది. కేంద్ర ప్రభుతం తీరుకు నిరసగా కార్మిక సంఘాలు, స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు ఆందోళనలు చేపట్టాయి. వెంటనే ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేస్తూ ఆష్టదిగ్బంధనానికి పిలుపు ఇచ్చారు ఉక్కు కార్మికులు.తాజాగా కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో మరో ముందడుగు వేసింది. 100 శాతం పెట్టుబడులకు సంబందించి కేంద్ర ప్రభుత్వం బిడ్స్ ఆహ్వనించింది.. ప్రైవేటీకరణ ప్రక్రియలో భాగంగా లీడ్ అడ్వైజర్, ట్ర్రాన్సాక్షన్స్ అడ్వైజర్ల కోసం ప్రభుత్వం బిడ్లు ఆహ్వానించింది. ఈ బిడ్లకు సంబంధించిన అప్లికేషన్లను బుధవారం నుంచి ఆన్ లైన్లో అందుబాటులో ఉంచింది. ఈనెల 15న ప్రీబిడ్ మీటింగ్ ఏర్పాటు చేసిన కేంద్రం.. ఈనెల 28న దరఖాస్తుకు ఆఖరుతేదీగా నిర్ణయించింది. ఈనెల 29న టెక్నికల్ బిడ్స్ తెరుస్తామని ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ తాజా చర్యతో స్టీల్ ప్లాంట్ ప్లైవేటీకరణ అంశంలో కార్మికుల ఆందోళనకు దిగారు.ఈ ఏడాది జనవరి 27న జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ను వందశాతం ప్రైవేటీకరించాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అస్సెట్ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో ప్రైవేటీకరణ దిశగా చర్యలు ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలిసినప్పటి నుంచి విశాఖలో కార్మికులు, ప్రజల ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.గత 147 రోజుల నుంచి ఇప్పటికీ వరకు విశాఖలోని కూర్మన్న పాలెం జంక్షన్ వద్ద రిలే నిరాహార దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. రోజుకో రూపంలో నిరసనలు తెలియచేస్తున్నారు. రిలీ నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. అయినా కార్మికిల డిమాండ్లను కేంద్రం ఏమాత్రం పట్టించుకోలేదు.కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఆందోళన తీవ్ర తరం చేసాయి కార్మిక సంఘాలు. ప్లాంట్ లోని వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నవారిని గేటు దగ్గరే అడ్డుకుని నిరసనలు తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రధాన గేటు దగ్గర నిలబడి.. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కార్మికులు, నాయకులు.తమ నిరసనలను ఏమాత్రం పట్టించుకోకుండా.. కేంద్రం వెనక్కు తగ్గకపోవడంపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ ను దొడ్డి దారిన అమ్మేందుకు ప్రణాళికలు రూపోందించడంపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.కేంద్రం తెలివిగా.. న్యాయ పరమ్తెన సమస్యలు తలేత్తకుండా, లిగల్ ఎడ్వజరీ కమిటీని ఎర్పాటు చేసింది. దీంతో కార్మికులు ఆందోళన తీవ్రతరం చేసారు. మెయిన్ గేటు వద్ద వేలాదిగా కార్మికులు చేరుకుని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. గేటు ముందే కుర్చుని ఆందోళన కొనసాగిస్తున్నారు.స్టీల్ ప్లాంట్ కార్మికులు, నిర్వాసితులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇళ్ళు, భూములు త్యాగం చేశామని.. అంతేకాదు 32 మంది అమరవీరుల త్యాగంతో ఏర్పడ్డ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేస్తూ ఉంటే ఊరుకోమని హెచ్చరించారు.మరోవైపు విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు రాస్తారోకో నిర్వహించాయి. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, పార్లమెంటు ఎంపీలు పోరాడాలని అన్నారు.అలాగే ఈ నెల 10న స్టీల్ ప్లాంట్‌కు మద్దతుగా నిరసన ప్రదర్శనకు అఖిలపక్ష కార్మిక ప్రజాసంఘాలు పిలుపునిచ్చాయి. భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత తీవ్రం చేయాలని నిర్ణయించాయి.