Telangana
వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ నాయకులు కోట రాంబాబు

వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ నాయకులు కోట రాంబాబు
క్యాపిటల్ వాయిస్, 18 సెప్టెంబర్(ఖమ్మం): మధిర లోని స్టేషన్ రోడ్ నందు శ్రీ వరసిద్ధి వినాయక వుత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక చవితి వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు డా. కోట రాంబాబు హాజరై విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా డా. కోట రాంబాబుకి కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. పర్యావరణ కాలుష్యము అవ్వకుండా మట్టి వినాయకుడిని పెట్టడం పట్ల హర్షిస్తూ కమిటీ వారిని అభినందించారు. నియోజకవర్గ ప్రజలందరి మీద ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఉండాలని, ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరారు.