Andhra PradeshNellore
వినాయక చవితి ఉత్సవాలు రద్దు చేయడం హిందూ ధర్మం పై దాడి చేయడమే : మిడతల రమేష్

వినాయక చవితి ఉత్సవాలు రద్దు చేయడం హిందూ ధర్మం పై దాడి చేయడమే : మిడతల రమేష్
క్యాపిటల్ వాయిస్ జిల్లా ప్రతినిధి, నెల్లూరు :- వినాయక చవితి ఉత్సవాలను రద్దు చేయడం ధర్మం మీద దాడి చేయడమే అవుతుందని బహిరంగ ఉత్సవాలకు అనుమతులు ఇవ్వాలని బిజెపి నేత మిడతల రమేష్ అన్నారు. నెల్లూరు దేవదాయ ధర్మదాయ శాఖ కార్యలయం వద్ద శనివారం నిరసన తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ లో అనుమతులివ్వడం, ఆంధ్రాలో రద్దు చేయడం ఆశ్చర్యంగా వుందన్నారు. కనీసం వాక్సిన్ సదుపాయం లేని విద్యార్డు లను పాఠశాలలలో అనుమతించడం ద్వారా, బ్రాంది షాపులలో విచ్చలవిడి సమూహాలు గుమ్మి గూడిన పుడు కరోనా రాదా అని ప్రశ్నించారు. కరోనా షరతులకు లోబడి గణేష్ ఉత్సవాలకు అనుమతులిచ్చి సంస్మృతి సాంప్రదాయాలను గౌరవించాలని రమేష్ డిమాండ్ చేశారు.