విద్యార్థి దశ కు విజయంతో చక్కని పునాది.బి కృష్ణారావు (విశాఖ రూరల్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్)

విద్యార్థి దశ కు విజయంతో చక్కని పునాది.బి కృష్ణారావు (విశాఖ రూరల్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్)
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం :మధురవాడ ప్రతినిధి
విద్యార్థి దశ కు విజయం స్కూల్ చక్కని పునాది వేస్తుందని విశాఖ రూరల్ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ బి కృష్ణ రావు అన్నారు.
శనివారం కొమ్మాది రోడ్డు లోని మధురవాడ విజయం స్కూల్ నూతన క్యాంపస్ భవనాన్ని ఎస్పి కృష్ణారావు ప్రారంభించారు.
ప్రిన్సిపల్ డాక్టర్ కె విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్పి కృష్ణారావు మాట్లాడుతూ మన ఆలోచనా విధానం ఉజ్వల భవిష్యత్తును నిర్దేశిస్తుందని విద్యార్థులకు సూచించారు. విద్యార్థి దశలో ప్రిన్సిపాల్ కె విజయలక్ష్మి అందించిన ప్రోత్సాహం మరువలేనిదని తెలియజేస్తూ ఈ సందర్భంగా ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. విజయం స్కూల్ మరింతమంది, ప్రతిభావంతులను తయారుచేసే కేంద్రంగా కావాలని ఎస్పీ అభిలషించారు.
ప్రిన్సిపల్ డాక్టర్ కె విజయలక్ష్మి మాట్లాడుతూ మా విద్యార్థులకు మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి మా క్యాంపస్ మార్చడం జరిగిందని తెలియజేశారు.
ఇక్కడ విద్యా ప్రమాణాలు మెరుగు తో పాటు ,విశాలమైన క్రీడా మైదానం , ఇండోర్ గేమ్స్ సాంస్కృతిక కార్యక్రమాల కొరకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని చెప్పారు.
అనంతరం ముఖ్య అతిథి విశాఖ రూరల్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ బి.కృష్ణారావు ను స్కూల్ యాజమాన్యం ఘనంగా సత్కరించింది .ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శించిన సంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ ఎన్ వి వి చౌదరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామారావు , గ్రేటర్ ఏడవ వార్డు కార్పొరేటర్ పిల్ల మంగమ్మ వెంకట్రావు వైకాపా ఏడవ వార్డ్ అధ్యక్షులు పోతిన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.