వెల్లుల్లి, తేనె మిశ్రమం తో కొన్ని రోగాలకు టాటా – ప్రయత్నిద్దామా !

వెల్లుల్లి, తేనె మిశ్రమం తో కొన్ని రోగాలకు టాటా – ప్రయత్నిద్దామా !
వెల్లుల్లి వల్ల శరీరానికి చాలా రకాల లాభాలు ఉంటాయి. ముఖ్యంగా వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రొటీన్లు లభిస్తాయి. వీటిని ఉదయం పూట ఖాళీ కడుపుతో తినడం వల్ల వచ్చే లాభాలు అన్నో ఇన్నో కావు. ఇందులో ఉండే మూలకాలు రక్తాన్ని శుభ్రం చేసేందుకు ప్రధాన పాత్ర పోషిస్తాయి అంతేకాకుండా రక్తనాళాల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను నియంత్రించి రక్తనాళాలు ఒత్తిడిని తగ్గించేందుకు కృషి చేస్తాయి. రక్తపోటు సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా వీటిని తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా వీటిని ఉదయం పూట పొట్టు తీసి ఖాళీ కడుపుతో నమలడం వల్ల మెదడులో సమస్యలు పూర్తిగా దూరమవుతాయి. ముఖ్యంగా జ్ఞాపక శక్తి పెంచుకోవాలనుకునే వారు వీటిని తప్పకుండా ఉదయం పూట తీసుకోవాలని సూచిస్తున్నారు.కరోనా పరిస్థితుల కారణంగా చాలామంది జలుబు, దగ్గు వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే వీరికి ఈ చిట్కా ప్రభావంతంగా పనిచేస్తుంది. నాలుగు వెల్లుల్లి రెబ్బలను తీసుకొని వాటిని దంచి.. అందులో రసాన్ని తీసి తేనెలో కలుపుకొని తాగితే శరీరానికి ప్రయోజనాలు లభించడం కాకుండా.. దగ్గు, జలుబు, కపం వంటి సమస్యలు దూరమవుతాయని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇది చర్మంపై కూడా ప్రభావంతంగా పనిచేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇందులో ఉండే మూలకాలు చర్మంపై వ్యాధులను నియంత్రించేందుకు ప్రభావంతంగా పనిచేస్తాయి. చర్మంపై ఎలర్జీ, గజ్జి, తామర వంటి వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయని నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వెల్లుల్లి రెబ్బలతో తేనెను కలుపుకొని తీసుకుంటే అది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంపొందించే.. వ్యాధుల నుంచి రక్షిస్తుంది.చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారికి.. ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. శరీరంలోని రక్తాన్ని శుభ్రపరిచి.. రక్తంలో చక్కెర పరిమాణాన్ని నియంత్రిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు.. తప్పకుండా ఈ వెల్లుల్లి తేనే మిశ్రమాన్ని తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండుసార్లు తీసుకుంటే మధుమేహం సమస్యలకు చెక్ పెట్టవచ్చు.ఈ మిశ్రమం పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కూడా సులభంగా నియంత్రిస్తుంది. కావున సులభంగా బరువు తగ్గాలనుకునే వారు ఈ మిశ్రమాన్ని తీసుకోవాలి. ఇందులో యాంటీ కొలెస్ట్రాల్ లక్షణాలు అధిక పరిమాణంలో ఉంటాయి. అందుకే పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును సులభంగా నియంత్రిస్తుంది.
( ఇది క్యాపిటల్ వాయిస్ పత్రిక ధ్రువీకరించింది కాదు. కేవలం అభిప్రాయాలు మాత్రమే, సేవించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం)