వెల్లంకి గ్రామం లో భారతీయ జనతా పార్టీ 42 వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు.

వెల్లంకి గ్రామం లో భారతీయ జనతా పార్టీ 42 వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు.
క్యాపిటల్ వాయిస్, విశాఖపట్నం ప్రతినిధి
ఆనందపురం మండలం వెల్లంకి గ్రామం లో భారతీయ జనతా పార్టీ 42 వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా బిజెపి జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి, శక్తి కేంద్రం ఇంచార్జ్ పి.వి.వి. ప్రసాదరావు పట్నాయక్ భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1980 ఏప్రిల్ 6 వ తారీఖున పార్టీ ఆవిర్భవించింది…. ఆవిర్భావం నాటి కాలం నుంచి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, దిన్ దయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజపేయి, లాల్ కృష్ణ అద్వానీ,మురళి మనోహర్ జోషి,ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో మహానుభావులు ఉన్నారుఅనిఅన్నారు.ఈకార్యక్రమానికి భీమిలి నియోజకవర్గం కో-ఆర్డినేటర్,కంటు బుత్త రామ నాయుడు మాట్లాడుతూ,పార్టీ కోసమే కాకుండా దేశం కోసం ఎందరో మహానుభావులు ప్రాణాలు అర్పించారు అని నరేంద్ర మోడీ సారధ్యం లో దేశం లో సుస్థిర పాలన కొనసాగడం మరో గొప్ప విషయం అని మాట్లాడారు ఆనందపురం మండల బిజేపి పార్టీ అధ్యక్షులు మీసాల రాము నాయుడు మాట్లాడుతూ భారత్ మాతా కీ జై….జై బీజేపీ అని నూతన ఉత్సహంతో పార్టీ కోసం మనం అందరం పని చేయాలని ఆంధ్ర లో అధికారమ మన లక్ష్యం అని, మాట్లాడారు. బిజేపి విశాఖ జిల్లామహిళామోర్చా,ఉపాధ్యక్షురాలు యేలూరుధర్మవతిమాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తల మధ్య మన గ్రామంలో, భారతీయ జనతా పార్టీ 42 వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు, బిజెపి జిల్లా మహిళా మోర్చా, కార్యదర్శి,మాద బత్తుల బుజ్జి, కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి గండి లక్ష్మి రావు, మండల ఉపాధ్యక్షులు, అడ్డూరి సురేష్, మండల ఎస్సీ మెర్చా అధ్యక్షులు, మల్లారపూ క్రిష్ణ, ఉపాధ్యక్షులు, నిమ్మకాయల అప్పలరాజు ప్రధాన కార్యదర్శి, పిల్లా చిన్నారావు, బూత్ స్థాయి అధ్యక్షులు,బిజేపి సీనియర్ నాయకులు బోర శ్రీను,దుక్క అప్పల సూరి పి. కనకరావు, తదితరులు పాల్గొన్నారు.