National

వస్త్రధారణ విషయంలో అమ్మాయిలను వేధించడం మానుకోవాలి – కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ

వస్త్రధారణ విషయంలో అమ్మాయిలను వేధించడం మానుకోవాలి – కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ

క్యాపిటల్ వాయిస్, జాతీయం :- ఒక మహిళ బికినీ వేసుకోవాలా, ఘూంగ్‌హట్(చీర కొగుతో ముసుగు) పాటించాలా, జీన్స్ వేసుకోవాలా లేక హిజాబ్ ధరించాలా అనేది ఆమె ఇష్టాన్ని బట్టే నిర్ణయించుకునే హక్కుందని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అన్నారు.స్కూళ్లు, కాలేజీల్లో ముస్లిం విద్యార్థినులు హిజాబ్(బుర్ఖా) ధరించరాదని కర్ణాటక లో చెలరేగిన వివాదం రాష్ట్ర వ్యాప్తంగా ఘర్షణపూర్తిత వాతావరణానికి దారి తీసింది. కలిసి చదువుకున్న విద్యార్థులు ఇప్పుడు వర్గాలుగా విడిపోయి కొట్లాటలకు దిగే పరిస్థితి తలెత్తడంతో అన్ని స్కూళ్లు, కాలేజీలను ప్రభుత్వం మూసేయించింది. హిజాబ్ వివాదం పై కర్ణాటక హైకోర్టులో ఉత్కంఠభరిత వాదనలు కొనసాగుతున్నాయి. ఈ ఉదంతంపై దేశవ్యాప్త చర్చ నడుస్తోంది. హిజాబ్ ధరించే హక్కుందని కర్ణాటక లో ముస్లిం విద్యార్థినులు చేస్తున్న నిరసనలకు వివిధ పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. కాంగ్రెస్ జాతీయ నేత ప్రియాంక గాంధీ సైతం హిజాబ్ వివాదంపై ఘాటుగా స్పందించారు.తాను ఎలాంటి దుస్తులు ధరించాలో నిర్ణయించుకోవడం మహిళల హక్కు అని, భారత రాజ్యాంగమే ఆ హక్కుకు హామీ ఇస్తున్నదని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అన్నారు. ఒక మహిళ బికినీ వేసుకోవాలా, ఘూంగ్‌హట్(చీర కొగుతో ముసుగు) పాటించాలా, జీన్స్ వేసుకోవాలా లేక హిజాబ్ ధరించాలా అనేది ఆమె ఇష్టాన్ని బట్టే నిర్ణయించుకునే హక్కుందని స్పష్టం చేశారు. వస్త్రధారణ విషయంలో అమ్మాయిలను వేధించడం ఆపాలని హితవుపలికారు. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళల ప్రోత్సాహం కోసం కాంగ్రెస్ ఇచ్చిన ‘లడ్కీ హు.. లడ్ సక్తీ హు..(నేను అమ్మాయినే.. పోరాడగలను)’ నినాదాన్ని కర్ణాటక హిజాబ్ నిరసనలకు సైతం జోడించారు ప్రియాంక.కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో మొదలైన హిజాబ్‌ వివాదం చిలికిచిలికి గాలివానగా మారి మతం రంగు పులుముకొని ఇతర జిల్లాలకు పాకింది. ఉడిపి, బాగల్కోట్, శివమొగ్గ, హరిహర, దావణగెరె పట్టణాల్లో విద్యార్థులు రెండు వర్గాలుగా చీలిపోయి పరస్పరం ఘర్షణకు దిగారు. రాళ్లు రువ్వుకొన్నారు. చాలా చోట్ల పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. గొడవల నేపథ్యంలో అన్ని స్కూళ్లు, కాలేజీలను మూసివేస్తున్నట్లు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ప్రకటించారు.ప్రియాంక సోదరుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ తదితరులు ఆందోళన చేస్తున్న విద్యార్థినులకు మద్దతిచ్చారు. హిజాబ్ ధరించారనే సాకుతో అమ్మాయిలను విద్యకు దూరం చేయాలనుకుంటే సహించబోమని, సరస్వతి దేవి అందరికీ విద్యను పంచుతుందని రాహుల్ గతంలో వ్యాఖ్యలు చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!