వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇంఛార్జి,జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించాలి : సి.ఎం జగన్

వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇంఛార్జి,జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించాలి : సి.ఎం జగన్
క్యాపిటల్ వాయిస్, అమరావతి :- ఏపీలో భారీ వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇంఛార్జి మంత్రులు, ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు అక్కడే ఉండి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించాలని సీఎం జగన్ ఆదేశించారు. గ్రామాల్లో పర్యటించాలని, ప్రజలకు తక్షణ సహాయం అందేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చి, పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు వరద బాధితులకు అండగా నిలవాలని మంత్రులు, ఎమ్మెల్యేలను సీఎం జగన్ ఆదేశించారు.పట్టణాల్లో పారిశుద్ధ్యపనులు, డ్రైనేజీల పూడికతీత పనులతో పాటు, వరద ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా వైద్య సదుపాయాలు కల్పించాలని సీఎం ఆదేశించారు. బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్ సరకుల పంపిణీ, జరిగిన నష్టంపై పక్కాగా అంచనాలు వేయాలన్నారు. పంటలు పూర్తిగా దెబ్బతిన్న రైతులు తిరిగి పంటలు సాగు చేసేలా గతంలోనే ప్రకటించిన విధంగా విత్తనాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాల్సిన అవసరం లేదని, తమ ప్రాంతంలోనే ఉండి సహాయక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని సీఎం జగన్ సూచించారు.