వరద నీటి వాగులో చిక్కుకున్న బస్సు.. త్రుటిలో తప్పిన ప్రమాదం !

వరద నీటి వాగులో చిక్కుకున్న బస్సు.. త్రుటిలో తప్పిన ప్రమాదం !
క్యాపిటల్ వాయిస్, అనంతపురం జిల్లా :- గత నాలుగు రోజులుగా అల్పపీడన ప్రభావిత వర్షాలకు రాయలసీమలోని కడప, కర్నూల్, అనంతపురం మరియు నెల్లూరు జిల్లాల వ్యాప్తంగా భారీగా వాగులు వంకలు పొంగి ఉవ్వెత్తున వరద నీరు గ్రామాలను సైతం ముంచెత్తుతున్నాయి. ఇదే క్రమంలో అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని చెరువు నిండి వాగు పారుతుండగా ఓ గార్మెంట్స్ బస్సు 30 మంది మహిళలు ఎక్కించుకొని వాగు గుండా ప్రయాణం చేస్తూ అదుపుతప్పి ఆ వాగు వరద నీటిలో కొట్టుకుపోయి వంతెనకు ఇరుక్కుపోయింది. గమనించిన స్థానికులు ఆ మహిళను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అప్పటిదాకా బస్సులో ఉన్న ప్రయాణీకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ వేచి చూస్తూ స్థానిక ప్రజల సహాయంతో బ్రతుకు జీవుడా అని బయటపడ్డారు. స్థానిక ప్రజలకు వారు కృతజ్ఞతలు తెలుపుతూ మేము వారి సహాయం వల్లే చావు నుండి బయటపడ్డామని ఆనందం వ్యక్తం చేసారు.