Andhra PradeshNellore

వాళ్లను శిక్షిస్తే సరిపోదు, నడిరోడ్డుపై మర్మాంగాలు కోసి, కాళ్లు చేతులు నరికేయాలి : ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి

వాళ్లను శిక్షిస్తే సరిపోదు, నడిరోడ్డుపై మర్మాంగాలు కోసి, కాళ్లు చేతులు నరికేయాలి : ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి

క్యాపిటల్ వాయిస్, (నెల్లూరు జిల్లా) :- వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలపై చెయ్యి వేస్తే నడిరోడ్డుపై కాల్చి పారేసిన చట్టాలు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఎట్టి చట్టాలు చేసిన మహిళలకు రక్షణ కరువుతుందని వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలపై చెయ్యి వేస్తే నడిరోడ్డుపై కాల్చిపారేసే చట్టాలు రావాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే మానవ రూపంలో మృగాళ్లలో భయం ఏర్పడుతుందన్నారు. నెల్లూరుజిల్లా ఇందుకూరిపేట మండలంలో జరిగిన ఆసరా పథకం రెండోవిడత ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసన్నకుమార్‌రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆడ బిడ్డలు రోడ్లపై
తిరగాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మహిళలపై దౌర్జన్యం చేసే కామాంధులను విదేశాల్లో నడిరోడ్డపై ఉరితీస్తారని, భారత్‌లో అలాంటి కఠిన చట్టాలు ఎందుకు తీసుకురారని ప్రశ్నించారు. మహిళల రక్షణ కోసం చట్టాల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరముందని ఆయన అన్నారు. చట్టాలలో మార్పు కోసం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. లైంగిక దాడికి పాల్పడిన వారిని పట్టుకుని శిక్షిస్తే సరిపోదని, నడిరోడ్డుపై మర్మాంగాలు కోసి, కాళ్లు చేతులు నరికేస్తేనే వారిలో భయం వస్తుందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ తీసుకొచ్చిన దిశ చట్టం ద్వారా కొంత వరకు మహిళలకు న్యాయం జరుగుతుందన్నారు. ఆడపిల్లలను
గౌరవించే సంస్కృతి మనదన్న ఆయన.. ప్రతి మహిళకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రజలపై కూడా ఉందన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!