Andhra Pradeshkrishna
ఉష్…ఉష్..ఉషూ..ఆపమ్మా… నీకు దండం…!!

ఉష్…ఉష్..ఉషూ..ఆపమ్మా… నీకు దండం…!!
మైలవరం గడపలో వైసీపీ నేతలకు ఝలక్ ఇచ్చిన మహిళ…!!
ఇళ్ళ పట్టాల అవకతవకల పై భగ్గుమన్న ముస్లిం మహిళ…!!
మైలవరం ఎమ్మెల్యే వసంత చేపట్టిన గడప గడపకు వైసీపీ ప్రభుత్వం కార్యక్రమం లో భాగంగా ఘటన…!!
ఇళ్ళ స్థలాల కేటాయింపులు పై ఎమ్మెల్యే వసంత ను ప్రశ్నించేందుకు సిద్ధమైన మహిళ…!!
మహిళను సముదాయించడానికి నాన తంటాలు పడిన వైసీపీ నేతలు…!!
క్యాపిటల్ వాయిస్, మైలవరం:- అయ్యో అలా అరవకు అమ్మ..నీకు దండం పెడతాము…అయ్యో అయ్యో ఎమ్మెల్యే సార్ వస్తున్నారు ఉష్..ఉష్ ఉషు ఆగమ్మా అంటూ మైలవరం పట్టణ వైసీపీ నేతలు పడిన తంటాలు అన్ని ఇన్ని కావు.. ఇళ్ళ స్థలాల కేటాయింపు లో జరిగిన అవకతకలపై మైలవరం కు చెందిన ముస్లిం మహిళ వైసీపీ నేతలకు ప్రశ్నాస్త్రాలు సంధించారు. దీంతో ఉక్కిరి బిక్కిరి అయిన నేతలు ఆ మహిళను సముదాయించడానికి నాన తంటాలు పడాల్సి వచ్చింది. అసలేం జరిగిందంటే…సుదీర్ఘ విరామం తరువాత ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గడప గడపకు వైసీపీ ప్రభుత్వం కార్యక్రమానికి ముస్లిం మహిళ నిరసన సెగ తగిలించారు. మైలవరం లో నిరుపేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ లో అవకతవకలు జరిగాయని అదే గ్రామానికి చెందిన ఒక ముస్లిం మహిళ నేతల పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కరికీ రెండు మూడు ప్లాట్ లు ఎలా ఇచ్చారంటూ తీవ్ర స్థాయి లో మండిపడ్డారు. మేము మీకు ఓట్లు వేయలేదా..? మాకెందుకు ఇంటి స్థలం ఇవ్వలేదు..? మేము అర్హులo కాదా అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి చేశాం చేశాం అని చెబుతున్నారు కదా ఎక్కడ అభివృద్ధి చేశారో చెప్పాలంటూ మహిళ నిలదీశారు. గడప గడపకు వైసీపీ ప్రభుత్వం కార్యక్రమం లో భాగంగా సోమవారం నుండి ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ప్రజల్లోకి వచ్చారు. ఈ నేపథ్యం లో మొదటి రోజునే మహిళ నిరసన సెగ తగిలించడం నియోజకవర్గం లో చర్చనీయాంశం గా మారింది. ఎమ్మెల్యే అదే ప్రాంతం లో పర్యటించడం తో ఆ మహిళ నిరసన ఎమ్మెల్యే కంట పడకుండా ఉండేందుకు నేతలు నాన తంటాలు పడ్డారట.. మొత్తంగా మైలవరం ఎమ్మెల్యే వసంత పునః ప్రారంభించిన గడప గడపకు వైసీపీ ప్రభుత్వం కార్యక్రమం అద్వితీయ జన నీరాజనం నడుమ నిరసన సెగ కూడా తగలడం రాజకీయ చర్చకు దారితీసింది..