Andhra PradeshGuntur
ఉమేష్ చంద్ర కు ఘన నివాళులు

ఉమేష్ చంద్ర కు ఘన నివాళులు
క్యాపిటల్ వాయిస్, (గుంటూరు జిల్లా) తెనాలి:- విథినిర్వహణలో అసమాన ప్రతిభ చూపి కడప పులిగా పేరొందిన చదలవాడ ఉమేష్ చంద్ర 22వ వర్థంతిని పురస్కరించుకొని శనివారంఉదయం చెంచు పేలోని ఆయన విగ్రహానికి పూల మాలలువేసి ఘన నివాళ్ళు అర్ఫించారు. ఈ సందర్భంగా తెనాలి డి.ఎస్.పి కె స్రవంతి రాయ్ మాట్లాడుతూ ఆయన జీవితంస్పూర్తిగా తీసుకోవాలని, ట్రాఫిక్ జాం లో చిక్కుకుపోయినపుడు తన కారుపై కాల్పులు జరిపిన దుండగులను వారి వెంటబడి తరిమి నపుడు వారిచేతిలోనే శనివారం రోజున బలైనారని, వారి ఙ్ణాపకాలు సదా ప్రజల మనస్సుల్లో ఉంటాయన్నారు. తెనాలి మునిసిపల్ ఛైర్మన్ ఖాలేదా నశీం మాట్లాడుతూ అత్యల్ప కాలంలోనే అనల్ప మైన సేవలందించారని వారిని ప్రజలు మరువరని అన్నారు. ఈకార్యక్రమంలో ఉమేష్ చంద్ర బాబాయి దలవాడ ఉమామహేశ్వరావు, సి ఐ లు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.