ఉచిత ఇ – శ్రమ కార్డు, 5 సంవత్సరాల లోపు పిల్లలకు ఆధార్ నమోదు కార్యక్రమం.

ఉచిత ఇ – శ్రమ కార్డు, 5 సంవత్సరాల లోపు పిల్లలకు ఆధార్ నమోదు కార్యక్రమం.
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి.
గాజువాక: జీవీఎంసీ పరిధి అయిన 76వ వార్డ్ బర్మా కొలని లో సి ఎస్ సి ( కామన్ సర్వీస్ సెంటర్ ) వి ఎల్ ఈ విద్యాసాగర్ మరియు డిస్ట్రిక్ట్ మేనేజర్ల వారి సహాయ సహకారంతో ఈ రోజు వై ఎస్ ఆర్ సి పి 76వ వార్డ్ ఇంచార్జ్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ట్రస్ట్ మెంబర్ దొడ్డి రమణ ఆధ్వర్యంలో ఐదు సంవత్సరాల లోపు పిల్లల ఆధార్ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిలుగా గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి,గాజువాక వై ఎస్ ఆర్ సి పి ఇంచార్జ్ తిప్పల దేవన్ రెడ్డి,దొడ్డి రమణ కలిసి ఇ- శ్రమ ఆధార్ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమ పధకాలు రావడానికి ఆధార్ చాలా అవసరం కనుక చిన్న పిల్లల తల్లిదండ్రులు ఆధార్ నమోదును ఒక బాధ్యతగా తీసుకొని 5 సంవత్సర లోపు పిల్లలకు ఆధార్ నమోదు చేయించుకోవాలని, ఇలాంటి బాధ్యత పరమైన కార్యక్రమాలు చేపడుతున్న నా తరఫున, వార్డు ప్రజల తరఫున దొడ్డి రమణ కు ప్రత్యేక అభినందనలు అని అన్నారు. ఈ క్రార్యక్రమంలో బర్మా కాలనీ ప్రెసిడెంట్ అప్పలరాజు, సెక్రెటరీ అండి బోయిన సన్నీ, దూసి లక్ష్మీ, ట్రేడ్ యూనియన్ నాయకులు తాటికొండ జగదీష్, అనపర్తి రమణ, దీనిశెట్టి చిన్నారావు,ఆర్.పి. వరలక్ష్మి, నడుపూరు శ్రవణ్ కుమార్, ఎస్. శ్రవణ్ కుమార్, ములకలపల్లి అశోక్ కుమార్, కాకినాడ పెంటారావు, వై. రమేష్ ,జి.వి.రమణ.