తొలగించిన పెన్షన్లను పునరుద్ధరించాలి : టీడీపీ కార్పొరేటర్లు

తొలగించిన పెన్షన్లను పునరుద్ధరించాలి : టీడీపీ కార్పొరేటర్లు
క్యాపిటల్ వాయిస్, విశాఖపట్నం ప్రతినిధి :- తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు పిలుపుమేరకు జీవీఎంసీ 1,2,3,4,5,7,42,46, 47,49వార్డుల టీడీపీ కార్పొరేటర్లు, టీడీపీ పార్టీ నాయకులు జోన్ 1, జోన్ 2, జోన్ 3, కమీషనర్ లకు మెమోరండం సమర్పించారు. పెండింగ్ పింఛన్ డబ్బులు పంపిణీ చేయకపోవడం, గతంలో ఇచ్చిన హామీ మేరకు పెంచుకుంటూ పోతాం అని చెప్పిన పింఛన్ పెంచకపోవడం. ఆధార్ లో వయసు మార్పు, కేవైసీ,ఇతర ప్రాంతంలో నివాసం ఒకే ఇంట్లో ఒకే పింఛన్ వంటి కొత్త నిబంధనలను తెరపైకి తెచ్చి లబ్ధిదారులను తొలగించడంపై ఎలాగైనా ప్రతి సంక్షేమ పథకాల్లో కోతలు విధిస్తున్న ప్రభుత్వం తొలగించిన పింఛన్లు వెంటనే పునరుద్ధరించాలని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో విశాఖపట్నం అన్ని జోన్లు వారీగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జోన్ కమీషనర్లకు వినతిపత్రాలు సమర్పించారు ఈ సందర్భంగా టిడిపి సీనియర్ నాయకులు మొల్లిలక్ష్మణరావు,పిల్లా వెంకట్రావు,పిల్లానర్సింగరావు మాట్లాడుతూ… పేదలకు అన్యాయంగా ప్రభుత్వం పింఛన్లు తొలిగింపు చర్యలు తీసుకోవడం చాలా దుర్మార్గం అని మండిపడ్డారు.రాష్ట్ర ప్రభుత్వం పై నమ్మకం లేదు కనుకనే ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకొచ్చాం అని తెలిపారు.గతంలో ఒక ఇంట్లో ఉండి ఒకే రేషన్ కార్డు కలిగి ఉండే వారికి వివిధ పింఛన్లు పొందిన వారిని అన్యాయంగా,ఎటువంటి సమాచారం లేకుండా చాలా దౌర్భాగ్యంగా తొలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.నాడు ప్రభుత్వ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి పింఛన్లు మంజూరు చేసి,నేడు ఆ పింఛన్లు ఇప్పుడు ఎలా తొలిగిస్తారని ప్రశ్నించారు.కొత్త రేషన్ కార్డుల మంజురులో కూడా తీవ్ర జాప్యం జరుగుతుందని అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.