తెలుగుదేశం మానిఫెస్టో ప్రజా ఆమోద యోగ్యమైనది : టీడీపీ పట్టణ అధ్యక్షుడు గజవల్లి శ్రీను
తెలుగుదేశం మానిఫెస్టో ప్రజా ఆమోద యోగ్యమైనది : టీడీపీ పట్టణ అధ్యక్షుడు గజవల్లి శ్రీను
క్యాపిటల్ వాయిస్,బాపట్ల జిల్లా, చీరాల:- తెలుగుదేశం మానిఫెస్టో ప్రజా ఆమోదయోగ్యమైనదని టీడీపీ పట్టణ అధ్యక్షుడు గజవల్లి శ్రీను అన్నారు.ఆదివారం క్యాపిటల్ వాయిస్ ప్రతినిధి తో మాట్లాడుతూ…తెలుగుదేశం ప్రజా సంక్షేమ పార్టీ అని అన్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం నిరంతరం పని చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు అని అన్నారు. అందుకే పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలోని పథకాలు అన్ని బడుగు బలహీన వర్గాల వారికి అందరికి ఉపయోగపడేవిగా ఉన్నాయని అన్నారు. తెలుగుదేశం పార్టీ మహిళలకు పెద్ద పీట వేస్తుందని అన్నారు. గతంలో కూడా మహిళలకు ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు కేటాయించిందని,ఎక్కువ మందికి మంత్రి పదవులు ఇచ్చిందని అన్నారు.అందుకే ఈ మ్యానిఫెస్టోలో మహాశక్తి పథకం ద్వారా మహిళలకు లబ్ది చేరే విధంగా ప్రవేశపెట్టారని అన్నారు.ఈ మహాశక్తి పథకం ద్వారా తెలుగుదేశం అధికారం లోకి రాగానే మహిళలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు.ఈ మహాశక్తి పధకంలో మహిళలకు దీపం పధకం క్రింద ప్రతి ఇంటికి ఏడాదికి మూడు సిలెండర్ లు ఉచితంగా ఇస్తారని అన్నారు. అంతేకాకుండా ఆర్టీసీ బస్సు లలో మహిళలకు ఉచిత ప్రయాణము అందిస్తామని అన్నారు.అంతేకాకుండా ఆడబిడ్డ నిధి నుండి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలను ఇస్తామని,తల్లికి వందనం పేరుతో మీ ఇంటిలో ఎంత మంది చదువుకుంటే అంత మందికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని అన్నారు.ఇవి అన్ని మా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అమలు చేస్తామని అన్నారు. తెలుగు దేశం మహిళా సాధికారికత కోసం పాటు పడుతుందని,ప్రతి మహిళను ధనవంతురాలను చేయడమే కోసమే చంద్రబాబు పని చేస్తున్నారని అన్నారు. దీనికోసం రాష్ట్రంలోని ప్రతి మహిళ ఒక సైనికురాలుగా పనిచేసి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చే వరకు పోరాడాలని అన్నారు.చంద్ర బాబు ముఖ్యమంత్రిని చేసుకుంటే రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు వస్తాయని,దాని వలన రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని అన్నారు.గతంలో కూడా ఎన్నో పరిశ్రమలు రాష్ట్రానికి తెచ్చిన ఘనత చంద్రబాబు దేనని అన్నారు.నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి క్రింద నెలకు మూడు వేల రూపాయలను ఇవ్వడం జరుగు తుందని,తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చే విధంగా చర్యలు ఉంటాయని అన్నారు. కనుక చంద్ర బాబుని మరలా ముఖ్యమంత్రిని చేసి రాష్ట్రాన్ని బాగు చేసుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు.ఈ వైసిపి పాలనలో రాష్ట్రం అధోగతి పాలైనదని,రాష్ట్రాన్ని బాగుచేయాలంటే ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబే సరైన వ్యక్తి అని అన్నారు.