Andhra PradeshGuntur
తెలిసి తెలియక నేను ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించండి : యరపతినేని శ్రీనివాసరావు

తెలిసి తెలియక నేను ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించండి : యరపతినేని శ్రీనివాసరావు
క్యాపిటల్ వాయిస్, (గుంటూరు జిల్లా) దాచేపల్లి :- గుంటూరు జిల్లా దాచేపల్లి లో జరిగిన తెలుగు దేశం పార్టీ ఆత్మ గౌరవ సభలో యరపతినేని ప్రసంగిస్తూ గత మా మీ ప్రభుత్వ పాలనలో ప్రజలను, కార్యకర్తలను నేను ఇబ్బంది పెట్టినట్లు ఉంటె నన్ను దయచేసి క్షమించండి అంటూ ఆయన ప్రజలను బహిరంగ క్షమాపణలు కోరారు. రైతులను ఉద్దేశించి యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ వైసిపి మోసపూరితమైన, కుట్రపూరిత మైన రైతు, ప్రజా వ్యతిరేక ప్రభుత్వం రైతులు తీవ్రంగా నష్టపోతే ప్రజా ప్రతినిదులు, అధికారులు రైతులను నేటికి పట్టించు కున్న పాపాన లేదని ఆయన వ్యాఖ్యానించారు. రైతుకు వ్యతిరేకంగా ఏ ప్రభుత్వం నిలిచిన ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్నట్లు చరిత్రలో లేదని,దేశ వ్యాప్తంగా రైతులు నిర్వహించిన ఉద్యమం తో సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ నే క్షమాపణ చెప్పవలసి వచ్చిందని ఆయన తెలిపారు.2014 న పల్నాడులో నిర్వహించిన ఆత్మ గౌరవ యాత్రతో అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధికారం లోకి వచ్చిందని, పల్నాడులో నేడు జరుగుతున్న ఈ రైతు యాత్ర వైసీపీ ప్రభుత్వం అంతానికి నాంది కాబోతుందన్నారు.ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కూడా రైతులకు చెల్లించాల్సిన నష్టపరిహారం చెల్లించి వారికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నా అని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. నేను అనే మాటను వీడి మనం అనే మాటను అందరూ వాడాలన్నారు. నా వలన కానీ, కార్యకర్తల వలన కానీ ఎవరినైనా తెలిసి, తెలియక ఇబ్బంది పెట్టినట్లయితే నేను ఈ సభా ముఖంగా క్షమాపణలు చెప్తున్నా అంటూ గద్గద స్వరంతో కంటి నుంచి వస్తున్న ఉబికిన కన్నీరుతో యరపతినేని ప్రజలకు క్షమాపణలు కోరారు.రానున్న రోజుల్లో అందరిని కలసి అందరిని కలుపుకుంటూ పార్టీ అధికారంలోకి రావడానికి శాయశక్తులా ప్రతి ఒక్కరూ పని చేయాలని యరపతినేని పిలుపునిచ్చారు.రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అధికార ప్రభుత్వం ఇంత వరకూ పంట నష్టం అంచనాలు కూడా వేయ కుండా ఒక పైసాచిక ఆనందం పొందుతున్నారని, ఈ ప్రభుత్వం క్రాప్ ఇన్సూరెన్స్ క్రింద చెల్లించాల్సిన మొత్తాన్ని ఇన్సూరెన్స్ కంపెనీలకు కూడా చెల్లించ కుండా సొంతానికి వాడేసుకొని ఇప్పుడు రైతులకు చెల్లించాల్సిన పంట నష్ట పరిహారం కూడా చెల్లించలేని దుర్మార్గమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.మోడీ లాంటి ప్రధానమంత్రే రైతుల నిరసన దీక్షలకు తలవంచి రైతు చట్టాలను వెనక్కు తీసుకుని రైతులకు క్షమాపణలు చెప్పాడన్నారు.ఇటీవల అకాల వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులకు బాసటగా, రైతు సమస్యలు తమ సమస్యలుగా భావించి వారికి తగిన నష్టపరిహారం వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, రైతులకు అండగా నిలుస్తూ, రైతులకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించే దిశలో *”రైతు కోసం – తెలుగుదేశం”* అనే కార్యక్రమాన్ని నిర్వహించి దాచేపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి విజయభాస్కర కళ్యాణ మండపం వరకు ఎడ్లబండ్లతో భారీ ర్యాలీ నిర్వహించి వేలాదిమంది రైతులు, కార్యకర్తలు, నాయకుల జన సందోహల మధ్య తమ వాణిని వినిపిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి రైతుల సమస్యల పరిష్కారం కోసం గురజాల మాజీ శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు పాటుపడుతున్నారని నక్కా ఆనంద్ బాబు అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో గుంటుపల్లి నాగేశ్వరరావు, అక్కినపల్లి బాలయ్య, తంగెళ్ల శ్రీనివాసరావు తదితర నాయకులు పాల్గొన్నారు.