తెలంగాణలో నేడు, రేపు వర్షాలు……. ఆరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం !?

తెలంగాణలో నేడు, రేపు వర్షాలు……. ఆరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం !?
క్యాపిటల్ వాయిస్, తెలంగాణ :- బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వానలు కురుస్తున్నాయి. ఏపీతో పాటు తెలంగాణ లోనూ భారీ వర్షాలు పడుతుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.తెలంగాణను వరుణుడు వీడటం లేదు. ప్రతీరోజూ ఏదో ఒక ప్రాంతంలో వర్షం పడుతూనే ఉంది. ముఖ్యంగా గత రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వానలు కురుస్తున్నాయి. ఏపీతో పాటు తెలంగాణ లోనూ భారీ వర్షాలు పడుతుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.తెలంగాణలో రెండు రోజులుగా పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం ఆరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాలకు యెల్లో అలర్ట్‌ను ప్రకటించింది. వికారాబాద్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కూడా నేడు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశంఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అదేవిధంగా శనివారం నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు యెల్లో అలర్ట్ జారీ చేసింది.