Andhra PradeshNTR JILLA
టీడీపీ గడపలైనా……. ఆగని వసంత అడుగు…!!

టీడీపీ గడపలైనా……. ఆగని వసంత అడుగు…!!
కరుడుగట్టిన టిడిపి వాదుల కుటుంబాల కు వెళ్లి సంక్షేమ పథకాల పై ఆరా…!!
స్వల్ప వ్యతిరేకతలు మినహా విజయవంతంగా గడప గడపకు వైసీపీ ప్రభుత్వం…!!
మైలవరం నియోజకవర్గం లో నిర్విరామంగా కొనసాగుతున్న గడప గడపకు వైసీపీ…!!
తోలుకోడు గ్రామం లో ఎమ్మెల్యే వసంతకు ఆత్మీయ స్వాగతం పలికిన మహిళలు…!!
క్యాపిటల్ వాయిస్, మైలవరం:- మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు వైసీపీ ప్రభుత్వం కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుంది. నియోజవర్గ పరిధిలోని గ్రామాల్లో గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే నిర్వహిస్తున్న గడప గడపకు వైసీపీ కార్యక్రమం పార్టీ కేడర్ లో నూతనోత్సాహం నింపుతోంది. స్వల్ప వ్యతిరేకతలు, స్థానిక పిర్యాదులు మినహా ఎమ్మెల్యే వసంత గడప గడపకు వైసీపీ విజయవంతంగా సాగుతుంది. ఇది ఇలా ఉండగా మైలవరం మండలం తోలుకోడు గ్రామం లో బుధవారం జరిగిన గడప గడపకు కార్యక్రమంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. గ్రామం లో ప్రతి గడప తొక్కుతున్న ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ కరుడుగట్టిన టిడిపి గడప సైతం తొక్కారు. ఇంటి ముఖ ద్వారం ఇరు వైపులా టిడిపి జెండాలు కట్టినప్పటికి ఆ గడపకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల అమలు పై ఆరా తీశారు. అయితే ఇదే అంశం పై అదేంటి మనం ప్రతిపక్షం గడపకు వెళ్ళడం ఏమిటి అని స్థానిక నేతలు ఒక్కింత ఆశ్చర్యం వ్యక్తం చేశారట. వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా అందిచాలనేది ప్రభుత్వ లక్ష్యం తన లక్ష్యం కూడా అని నేతలకు ఎమ్మెల్యే వసంత చెప్పారట. మొత్తంగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అనుసరిస్తున్న విధానాలపై తోలుకోడు గ్రామ ప్రజలు నూటికి నూరు మార్కులు వేయడం గమనార్హం.
