Andhra Pradesh
టిడిపి అధినేత చంద్రబాబు అరెస్ట్ – అర్ధరాత్రి హై డ్రామా !?

టిడిపి అధినేత చంద్రబాబు అరెస్ట్ – అర్ధరాత్రి హై డ్రామా !?
చంద్రబాబు అరెస్ట్…. స్కిల్ డెవలప్‍మెంట్ కేసులో చంద్రబాబు
క్యాపిటల్ వాయిస్, నంద్యాల :-
హైకోర్టుకు ప్రాథమిక ఆధారలు ఇచ్చామంటున్న పోలీసులుచంద్రబాబు తరఫున పోలీసులతో వాదిస్తున్న న్యాయవాదులుఆధారాలు చూపాలంటున్న న్యాయవాదులు
హైకోర్టుకు ప్రాథమిక ఆధారలు ఇచ్చామంటున్న పోలీసులుచంద్రబాబు తరఫున పోలీసులతో వాదిస్తున్న న్యాయవాదులుఆధారాలు చూపాలంటున్న న్యాయవాదులు
రిమాండ్ రిపోర్టులో ఉన్నాయంటున్న పోలీసులు
FIR ఇస్తామంటున్న పోలీసులు
నంద్యాలలో అర్థరాత్రి నుంచి హైడ్రామా
తన అరెస్ట్ గురించి ముందే చెప్పిన చంద్రబాబు
తెల్లవారుజామున ఏం జరిగింది.?
తెదేపా అధినేత చంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నంద్యాలలో చంద్రబాబు బస చేసిన ఆర్.కె ఫంక్షన్ హాల్ వద్దకు శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులు భారీ ఎత్తున చేరుకున్నారు. డీఐజీ రఘురామరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు భారీగా మోహరించారు. తెదేపా కార్యకర్తలు, నేతలు అక్కడికి చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. వేకువ జామున చంద్రబాబు బస్సు దిగడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను ప్రస్తుతం నంద్యాల నుంచి ఓర్వకల్లు మీదుగా చంద్రబాబు ను గన్నవరం ఎయిర్పోర్ట్ కి తీసుకువస్తున్నట్లుగా సమాచారం !