Andhra PradeshVisakhapatnam

స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాలీ,స్వచ్ఛ సర్వేక్షణ్ పై అవగాహన కార్యక్రమం.

స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాలీ,స్వచ్ఛ సర్వేక్షణ్ పై అవగాహన కార్యక్రమం.

క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం :మధురవాడ ప్రతినిధి

మధురవాడ:మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ జి.లక్ష్మిశ బుధవారం జోన్-2 పరిధి లోని 5,7,వార్డుల పరిధిలో మల్లయ్యపాలెం,వాంబేకాలనీ, శివశక్తినగర్ రోడ్డులో కొండవాలు ప్రాంతాలైన అయ్యప్పనగర్,వివేకానంద నగర్,ముత్యాలమ్మకాలనీ, గాంధీనగర్,మరియు శివశక్తినగర్ స్మశానవాటిక  తదితర ప్రాంతాలలో ఆయా వార్డు కార్పొరేటర్లు పిళ్ళ మంగమ్మ,వెంకటరావు, మొల్లిహేమలత, మొల్లి లక్ష్మణరావు, వైయస్సార్సీపి 7వవార్డు అధ్యక్షులు పోతిన శ్రీనివాసరావు లతో కలసి సుడిగాలి పర్యటన చేశారు.ఈ సందర్భంగా కమిషనర్  కాలువలు,డ్రైన్లు,వాంబే కాలనీ లోని యూజీడీ నిర్వహణ, పార్కులు,5వవార్డు లోని కొండవాలు ప్రాంతాల నీటి సమస్యలు,విద్యుత్,స్మశాన వాటికలు వాటి సమస్యలు, నిర్వహణ పరిశీలించారు. ముత్యాలమ్మకాలనీ, గాంధీనగర్ లోతట్టు ప్రాంతాలలో కాలువలు లేక మురుగువర్షం నీటితో మునిగిపోయే పరిస్థితులను పరిశీలించారు.ప్రత్యామ్నాయం చూడాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శివశక్తినగర్ మాస్టర్ ప్లాన్ రోడ్ లో అక్రమ బడ్డీలు,స్మశాన వాటికకు ఆనుకొని ఉన్న బడ్డీలను తొలగించాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు.5,7 వార్డులలో ముఖ్య సమస్య అయిన పందులు సంచారం అధికంగా కనిపిస్తున్నాయని వాటిని నిర్మూలించాలని ఆదేశించారు. డంపింగ్ యార్డ్ వలన మారికవలస రాజీవ్ గృహకల్ప, బోరవానిపాలెం ప్రజలు పడుతున్న అవస్థలను కార్పొరేటర్ కమిషనర్ కు వివరించారు.అనంతరం స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాలీలో పాల్గొని,స్వచ్ఛ సర్వేక్షణ్ పై ప్రజా సంఘాలు ప్రజా ప్రతినిధులతో కలసి పనిచేసి ప్రజలకు అవగాహన కల్పించాలని, కార్యదర్శులందరూ స్వచ్ఛ సర్వేక్షణ్ పైఅవగాహన కలిగి ఉండాలని,యూజర్ చార్జీల వసూలను వేగవంతం చేయాలని సూచించారు.5,7 వార్డులలోని స్మశాన వాటికలలో మౌళిక వసతులైన షెడ్లు,విద్యుత్,త్రాగునీరు ఏర్పాటు చేసి అభివృద్ధి పరచాలని కార్పొరేటర్లు కమిషనర్ కు తెలిపారు. ఈ సందర్భంగా 5వ వార్డ్ సమస్యలు,అభివృద్ధి కార్యక్రమాలపై కార్పొరేటర్ మొల్లి హేమలత కమిషనర్ కు వినతిపత్రాన్ని అందించారు. ముఖ్యంగా డంపింగ్ యార్డ్ వలన సమస్యలు, కొండవాలు ప్రాంతాలైన సాయిరామకాలనీ,సర్వేనెంబర్ 27లో అయ్యప్పనగర్, వివేకానందనగర్, ముత్యాలమ్మకాలనీ, గాంధీనగర్,సద్గురు సాయినాథ్ కాలనీ,శివశక్తినగర్,మరియు శారదనగర్ ప్రాంతాలలో విద్యుత్ స్తంభాలు అవసరమని,విద్యుత్ స్తంభాలు లేక ఆప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, త్వరితగతిన విద్యుత్ స్తంభాలు,లైట్లు ఏర్పాటుకు సహకరించాలని వినతి పత్రాన్ని అందించారు.ఈ సందర్భంగా జివిఎంసి కమిషనర్ కమిషనర్ డాక్టర్ జి. లక్ష్మిశ.స్పందిస్తూ త్వరలోనే సమస్యలను పరిష్కారం దిశగా తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.ఈపర్యటనలో ప్రధాన వైద్యాధికారి డాక్టర్ కెఎస్ఎల్ జి శాస్త్రి,జోనల్ కమిషనర్ బొడ్డేపల్లి రాము, కార్యనిర్వాహక ఇంజినీరు వంశి,ఎసిపిభాస్కర్, ఎఎంఒహెచ్ కిషోర్,ఉపకార్వనిర్వాహక ఇంజినీరు,ఇంజినీరు,శానిటరీ సూపర్వైజర్,శానిటరీ ఇన్స్పెక్టర్,వార్డు-సచివాలయ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!