Andhra PradeshNTR JILLA
సుస్థిర మైనా… అస్థిరం దిశగా…మైలవరం !!

సుస్థిర మైనా…! అస్థిరం దిశగా…!!
మైలవరం లో వేల మంది జన సైనికులు ఒక వైపు… సారు మరో వైపు…!!
మైలవరం జనసేన పార్టీ ఇంఛార్జి కి తలనొప్పి గా మారిన ఒకరిద్దరు నేతల వ్యవహార శైలి…!!
పార్టీ నాయకత్వాన్ని బలహీన పరుస్తున్నారు అంటూ పార్టీ నేతలే అసహనం…!!
వ్యక్తి ప్రయోజనాలే కానీ పార్టీ బలోపేతానికి చర్యలు ఏవి అంటూ వాఖ్య…!!
ఒక వ్యక్తి విభేదాలను వర్గ పోరుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ అధినాయకత్వం అసహనం…!
కుల ప్రస్తావనల తో పార్టీ కేడర్ లో చీలికలు తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు అంటూ ఆగ్రహం…!!
క్యాపిటల్ వాయిస్, కొండపల్లి మున్సిపాలిటీ:- మైలవరం నియోజకవర్గ రాజకీయ చరిత్ర లో గతం లో ఎన్నడూ లేని విధంగా జనసేన పార్టీ బలోపేతం వైపు అడుగులు వేస్తోంది. ప్రజా సమస్యల పై నిరంతర ప్రాయంగా పోరాడుతూ అధికార పార్టీ పై విమర్శనాస్త్రాలు ప్రయోగిస్తుంది. అంతేకాకుండా అధికార పార్టీ మంత్రుల పై, ఎమ్మెల్యే పై అవినీతి ఆరోపణలతో విరుచుకుపడుతూ మైలవరం లో జనసేన సుస్థిర స్థానం దిశగా దూసుకుపోతోంది.. కానీ పార్టీ లోని ఒకరు ఇద్దరు నేతల వ్యవహారశైలి పార్టీ ఇంఛార్జి కు తల నొప్పి గా మారిందట. కుటుంబం గా కలిసి పని చేయాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ ఆ బాధ్యతను విస్మరించి సమైక్య రాగం లో వ్యతిరేకగళం వినిపిస్తున్నారట.. ఇప్పుడు ఇదే మైలవరం రాజకీయం లో చర్చనీయంశం గా మారింది. నియోజకవర్గం లో పూర్తి స్థాయి లో బలపడిన జనసేన పార్టీ లో ప్రస్తుతం కొనసాగుతున్న వ్యతిరేక స్వరాలు పార్టీ మనుగడను ప్రశ్నార్ధకం చేస్తున్నాయి అనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. జనసేన పార్టీ ఆవిర్భావం తరువాత మైలవరం బాధ్యతలు భుజానవేసుకున్న అక్కల రామ్మోహన్ రావు (గాంధీ) మైలవరం లో పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేని కృషి చేశారు. పార్టీ కేడర్ ను సమన్వయం తో నడిపిస్తూ నియోజకవర్గం లో జనసేన పార్టీ నేతలు అధికార పార్టీ నీ సవాల్ చేసే స్థాయి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో సొంత పార్టీ లో ఒకరిద్దరు నేతల వ్యవహార శైలి ఆయనకు తలనొప్పి గా మారిందట. పార్టీ అంతర్గత విషయాలు మీడియాకు ఉద్దేశ పూర్వకంగానే లీకులు ఇస్తూ పార్టీ కేడర్ లో అయోమయం సృష్టిస్తున్నారు అంటూ కొందరు నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అట.. కుల మతాలకు అతీతంగా మైలవరం నియోజకవర్గ జనసేన పని చేస్తుందని కానీ కుల ప్రస్తావనలు తీసుకొచ్చి పార్టీ కేడర్ లో చీలికలు తీసుకొచ్చేందుకు కుట్రలు చేస్తున్నారు అంటూ పార్టీ అధినాయకత్వం తీవ్ర ఆగ్రహం తో ఉన్నారట. మైలవరం నియోజకవర్గం లో జనసేన పార్టీకి ప్రజలు సముచిత స్థానం కట్టబెట్టారని గత పదేళ్లుగా జన సైనికులు పడిన కష్టానికి అది ప్రతిఫలం అని అదినాయకత్వం భావిస్తోంది. అయితే ఒకరు ఇద్దరు స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ లో కుల చిచ్చు , ప్రాంతీయ వాదాలను తెరమీదకు తీసుకువచ్చి పార్టీ కేడర్ లో చీలికలు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు మైలవరం నియోజకవర్గం వ్యాప్తంగా ఘనంగా జరిగిన క్రమం లో ఒకరు ఇద్దరు హాజరు కాలేదని పార్టీ లో విబేధాలు ఉన్నట్లు మీడియా వర్ణించడం దురదృష్టం కరం అంటూ సోషల్ మీడియా వేదికగా నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. మైలవరం నియోజకవర్గ ప్రజల ఆదరణ తో సుస్థిర స్థానాన్ని దక్కించుకున్న జనసేన పార్టీ లో విభేదాలకు, వర్గపోరుకు తావు లేదని ఒకరిద్దరు వ్యక్తిగత ప్రయోజనాలు తమకు ముఖ్యం కాదని నేతలు చర్చిoచుకుంటున్నారు అట.. సుస్థిరమైన పార్టీని అస్థిర పరిచే చర్యలు ఉపేక్షించేది లేదని ఎవరు ఎన్ని కుట్రలు చేసిన మైలవరం జనసేన పార్టీ బలోపేతమే అంతిమ లక్ష్యంగా పని చేస్తామని కేడర్ బలంగా చెబుతుందట. మొత్తంగా పార్టీ లో నెలకొన్న వ్యతిరేక విధానాల పై పార్టీ అధిష్టానం దృష్టి సారించి గాడిన పెట్టల్సిన అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది..
(జరుగుతున్న ప్రచారం మేరకు కథనం)