AMARAVATHIAndhra Pradesh
సూర్యుడిమీద ఉమ్మేస్తున్నావ్…తిరిగి అది నీమీదే పడుతుంది జాగ్రత్త : వర్ల రామయ్య

సూర్యుడిమీద ఉమ్మేస్తున్నావ్…తిరిగి అది నీమీదే పడుతుంది జాగ్రత్త : వర్ల రామయ్య
క్యాపిటల్ వాయిస్ ప్రతినిధి, అమరావతి :- తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును ఉద్దేశించి ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లు ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా ఒంటరిగా నిలబడి కనీసం రెండు సీట్లు గెలిచినా చంద్రబాబు ఇంట్లో శాశ్వతంగా పాకీ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు నారాయణస్వామి వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఒంటరిగా నిలబడి గెలిచే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు లేవని మిత్రపక్షం పేరుతో బీజేపీ, కమ్యూనిస్టులు, జనసేన పార్టీల్లో ఒక్కోసారి ఒక్కో పార్టీతో కలిసి పోటీ చేయడం టీడీపీకే చెల్లిందన్నారు.ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ధైర్యంగా మీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్‌లో అడుగుపెట్టే దమ్ములేని పిరికి ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి అని వ్యాఖ్యానించారు. రాజకీయ ఉద్ధండుడైన చంద్రబాబుపై అవాకులు, చవాకులు పేలడం నారాయణస్వామి రాజకీయ దిగజారుడుతనమని దుయ్యబట్టారు. సూర్యుడి మీద ఉమ్మేస్తున్నావ్ నారాయణ స్వామి.. అది, తిరిగి నీ ముఖమ్మీద పడుతుంది అంటూ
వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. నేల విడిచి సాము చేయవద్దని.. ఇక, మూడు నెలలే నీ ముచ్చట మూగజీవీ అంటూ వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఏపీలో త్వరలోనే మంత్రివర్గం జరగనున్న విషయం తెలిసిందే. రెండున్నరేళ్ల తర్వాత మంత్రులను మార్చేస్తామని ముఖ్యమంత్రి జగన్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడు నెలల్లో డిప్యూటీ సీఎం నారాయణస్వామి పదవి
పోతుందని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు.