స్థానిక రాజకీయ నాయకుల ఒత్తిడికి తలోగ్గుతున్న అధికారులు.

స్థానిక రాజకీయ నాయకుల ఒత్తిడికి తలోగ్గుతున్న అధికారులు.
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
స్థానిక రాజకీయ నాయకుల ధన దాహం,ఫలానా చోట ప్రభుత్వ భూమి అక్రమణ,అక్రమ నిర్మాణం జరుగుతుందని తెలిసిన కాసులకు కక్కుర్తి పడి చూసిచూడనట్లు వ్యవహరించే ప్రభుత్వ అదికార యంత్రంగం….వెరసి మొత్తానికి ప్రభుత్వ భూమలు అన్యక్రాంతం అవుతున్నాయి. గతంలో 100 కోట్ల భూమి స్కాం లో అధికార పార్టీ ఎమ్ ఎల్ ఏ చేసిన తప్పుకి తహసీల్దార్ నరసింహామూర్తి సస్పెండ్ అవ్వటం వల్ల అధికారులు ఏమి చెయ్యలేని పరిస్థితిలో అధికారులు చూసి చూడనట్టు వ్యవహారిస్థిన్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా వ్యవస్థలో సాదారణ విషయమైనా చినగదిలి మండలం లో గతంలో పనిచేసిన తహసిల్దార్ నరసింహ మూర్తి జూన్ నెలలో గణేష్ నగర్ కాలనీలో ఉన్న సర్వే నెంబరు 31/3 పై స్దానికుల నుండి వచ్చిన ఫిర్యాదులకు స్పందించి ఎంక్వేరి వేసి ఇది ప్రభుత్వ భూమి గెడ్డ వాగు అని ఈ భూమిలో ఎటువంటి కట్టడాలు నిర్మాణం చేయకూడదని విఆర్వొకి,సచివాలయ సిబ్బందికి ఆదేశాలు జారి చేసారు. అయినప్పటికీ ఈ భూమిలో ఇప్పుడు కొత్త ఎమ్ ఆర్ వో రామారావు వచ్చిన తరువాత అక్రమ నిర్మాణాలు యదేచ్చగా జరుగుతున్న రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల పట్టించు కోవడం లేదని స్దానికులు బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు . తహసిల్దార్ కి ఫిర్యాదు చేయడానికి వెళ్ళినప్పుడు ఫిర్యాదుదారుల ఎదురుగా కింది స్థాయి సిబ్బందికి అక్కడ ఉన్న కట్టడాలను పడగొట్టెయండని హుకుం జారి చేయడం తప్పితే ఆచరణలో రాజకీయనాయకుల ప్రమేయంతో మాత్రం అక్రమ కట్టడాలపై చర్యలు శూన్యం అని స్థానికులు బహిరంగంగా విమర్శలు చేస్తూనారు. 40 సంవత్సరాల నుండి గణేష్ నగర్ కాలనీలో నివసిస్తు జి వి యం సి సకాలంలో అన్ని పన్నులు చెల్లిస్తున్న రోడ్డు రాళ్లు తేలిపోయాయని ఎన్ని ఫిర్యాదులు ఇచ్చిన పట్టించుకోని ప్రభుత్వ అదికారులు అక్రమార్కులకు మాత్రం ఎమిలేకపోయిన ప్లాన్ ఇస్తూ అన్ని సౌకర్యాలను కల్పిస్తూ కొమ్ముకాయడం ఎంత వరకు సమంజసం అని గణేష్ నగర్ కాలనీ వాసులు విమర్శలు చేస్తున్నారు. మాకు కళ్యాణ మండపానికి, అంగన్ వాడి కేంద్రానికి,గ్రంథాలయం అలాంటి ప్రజాప్రయోజనానికి ఈ స్థలాన్ని జివియంసి ఉపయోగించి ఉంటే భవిష్యత్తులో గణేష్ నగర్ కాలనీ వాసులు ఇబ్బందులు లేకుండా జీవించేవారమని కాలనీ వాసులు అంటున్నారు. కానీ ప్రభుత్వ అదికారులు, రాజకీయ నాయకులు ఇకనైనా కబ్జాదారులకు సహకరించ కుండా ప్రజలకు ఉపయోగపడే విదంగా సహకరించగలరని ప్రజలు కోరుకుంటున్నారు.లేనిపక్షంలో కలెక్టర్ ని కలసి ఫిర్యాదు చేస్తామని గణేష్ నగర్ కాలనీ వాసులు,ప్రజాసంఘాల వారు,మానవహక్కుల నాయకులు అంటున్నారు.