Andhra PradeshVisakhapatnam
శ్రీ సిధ్ధేశ్వర స్వామి పీఠం లో సిధ్ధేశ్వర స్వామి వారికి విశేషంగా పంచామృతాభిషేకాలు.

శ్రీ సిధ్ధేశ్వర స్వామి పీఠం లో సిధ్ధేశ్వర స్వామి వారికి విశేషంగా పంచామృతాభిషేకాలు.
క్యాపిటల్ వాయిస్ : విశాఖపట్నం :ప్రతినిధి
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ సిధ్ధేశ్వర స్వామి పీఠం లో సిధ్ధేశ్వర స్వామి వారికి విశేషంగా పంచామృతాభిషేకాలు , సామూహిక రుధ్రాభిషేకాలు,ప్రత్యేక పూజలు అలంకరణ గావించి, సాయంత్రం స్వామివారి తిరువీధి ఊరేగింపు తదుపరి లింగోద్బవకాలంలో స్వామి వారికి సహస్ర కలశాభిషేకం నిర్వహించారు. పై కార్యక్రమాలలో ఆలయ ధర్మకర్త శ్రీ ఎ నరసింహ మూర్తి, ఆలయ అర్చకులు దూసి రామలింగ స్వామి శర్మ మరియు కమిటీ సభ్యులు కె చిన్నారావు, పి.నాగేశ్వరరావు , నాగోతి సూర్య ప్రకాష్ మరియు బయపల్లి సతీష్ కుమార్ పాల్గొన్నారు. భక్తులు అశేషము గా పాల్గొన్నారు. వారికి తీర్థ ప్రసాదములు అందజేసినారు.