Andhra PradeshVisakhapatnam
శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి పంచామృతాభిషేకాలు.

శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి పంచామృతాభిషేకాలు.
క్యాపిటల్ వాయిస్ : మధురవాడ ప్రతినిధి
హనుమత్ వ్రతం సందర్భంగా శ్రీ సిధ్ధేశ్వర స్వామి పీఠం లో గల శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి ఉదయం పంచామృతాభిషేకాలు అనంతరం 21 సుగంధ ద్రవ్యాలతో స్వామి వారికి లేపనం జరిపించి ప్రత్యేక అలంకరణ గావించారు. తదుపరి సుందరాకాండ హోమం జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త ఎ నరసింహ మూర్తి ఆలయ అర్చకులు వేంకట నరసింహాచార్యులు వారు దూసి రామలింగ స్వామి శర్మ, మరియు పవన్ కుమార్, కమిటీ సభ్యులు కె చిన్నారావు, పి నాగేశ్వరరావు, నాగోతి సూర్య ప్రకాష్ మరియు బయపల్లి సతీష్ కుమార్ పాల్గొన్నారు. భక్తులకు తీర్థ ప్రసాదములు అందజేసినారు. సాయంత్రం హనుమాన్ చాలీసా పారాయణం జరిపించారు.