శ్రీ కృష్ణదేవరాయ నేషనల్ బెస్ట్ సర్వీసెస్ అవార్డు ను రాష్ట్ర మంత్రి శంకరనారాయణ చేతుల మీదుగా అందుకున్న తాటిపూడి

శ్రీ కృష్ణదేవరాయ నేషనల్ బెస్ట్ సర్వీసెస్ అవార్డు ను రాష్ట్ర మంత్రి శంకరనారాయణ చేతుల మీదుగా అందుకున్న తాటిపూడి.
క్యాపిటల్ వాయిస్ :అనంతపురం ప్రతినిధి
విశాఖపట్నం,డిసెంబర్28.నిరంతరం సమాజాసేవ లో తరిస్తున్న హ్యాపీ ఇండియా సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు డా,,తాటిపూడి వరహ వెంకట సత్యనారాయణ కు శ్రీ కృష్ణదేవరాయ నేషనల్ బెస్ట్ సర్వీసెస్ అవార్డును అందుకున్నారు. తాటిపూడి సత్యనారాయణ తన సొంత నిధులతో 2003 వ సంవత్సరం నుండి అనాధులు, వృద్దులు, దివ్యాంగులు, మానసిక దివ్యాంగులు,రోగులు, లెప్రసి రోగులు, పేద విద్యార్థులకు అభాగ్యులకు,అంధులకు, పలు సామాజిక సేవలు అందించడమే కాకుండా చలివేంద్రాలు, రక్తదాన శిబిరాలు, మెగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. చేస్తూ,కరోనా క్లిష్ట సమయంలో కూడా వందలాది మందికి సహాయం చేసిన తాటిపూడి సేవలను గుర్తించి నిర్వాహకులు ఈ అవార్డును ఇచ్చారు. అనంతపురం జిల్లాకు చెందిన మదర్ చారిటబుల్ ట్రస్ట్, మదర్ ఆర్గనైజెషన్, నరసింహప్ప ఫౌండేషన్ సంయుక్తంగా ఏర్పాటుచేసిన శ్రీకృష్ణదేవరాయ నేషనల్ బెస్ట్ అవార్డు ను అనంతపురం పెనుకొండలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కుదిబండ్ల శంకరనారాయణ, అనంతపురం జిల్లా సబ్ కలెక్టర్ మళ్లారపు నవీన్ ఐ.ఏ.ఎస్, ఏ.పి జాయింట్ కమీషనర్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో టి.నాగలక్ష్మి, పెనుకొండ జెడ్.పి.టి.సి, ఎమ్.పి.పి మరియు ప్రముఖుల చేతుల మీదుగా తాటిపూడి ఈ అవార్డు ను అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి శంకరనారాయణ, సబ్ కలెక్టర్ నవీన్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో నాగలక్ష్మి లు తాటిపూడి సేవలను అభినందించారు.