National
శ్రీవారి పూజల్లో లోపాలపై పిటిషన్ – సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కీలక వ్యాఖ్యలు !

శ్రీవారి పూజల్లో లోపాలపై పిటిషన్ – సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కీలక వ్యాఖ్యలు !
క్యాపిటల్ వాయిస్, జాతీయం :- తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామికి నిర్వహిస్తున్న వివిధ రకాల సేవలు ఆగమ శాస్త్రం ప్రకారం జరగడం లేదంటూ ఆంధ్రప్రదేశ్ కు చెందిన శ్రీవారి భక్తుడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లో హిందూయేతరుల నుంచి డిక్లరేషన్ తీసుకోవాలన్న నిబంధనలను పాటించడం లేదని కూడా పేర్కొన్నారు. పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. చీఫ్ జస్టిస్ బెంచ్ ముందుకు వచ్చింది. వెంటనే కేసుకు సంబంధించిన వివరాలు తెలుసుకోవాలని పిటిషనర్ బెంచ్‌ను కోరారు. అయితే ఈ అంశంపై చీఫ్ జస్టిస్ పిటిషనర్‌తో తెలుగులో మాట్లాడారు. టీటీడీలో తప్పులు జరిగితే వేంకటేశ్వరస్వామి ఎవరినీ ఉపేక్షించరని వ్యాఖ్యానించారు.