AMARAVATHIAndhra Pradesh
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం.. 4 గేట్లు ఎత్తివేత

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం.. 4 గేట్లు ఎత్తివేత
క్యాపిటల్ వాయిస్, అమరావతి :- శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో అధికారులు ఇవాళ 4 గేట్లను ఎత్తారు. 1.11 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎగువ నుంచి శ్రీశైలానికి 1.71 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవాహిస్తోంది. శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 884.80 అడుగులు ఉండగా.. ప్రస్తుత నీటినిల్వ 214.84 టీఎంసీలుగా ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తున్నారు. విద్యుదుత్పత్తి చేసి 64,102 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు.