Andhra PradeshKurnool
సిరాలదొడ్డి విద్యుత్ సబ్ స్టేషన్ ఏఈ సుష్మ కుటుంబ కలహాలతో ఆత్మహత్య !

సిరాలదొడ్డి విద్యుత్ సబ్ స్టేషన్ ఏఈ సుష్మ కుటుంబ కలహాలతో ఆత్మహత్య !
క్యాపిటల్ వాయిస్, కర్నూలు జిల్లా :- కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని శిల్ప ఎస్టేట్ కాలనిలో విషాదం చోటుచేసుకుంది. మండల పరిధిలోని సిరాలదొడ్డి విద్యుత్ సబ్ స్టేషన్లో ఏఈ గా విధులు నిర్వహిస్తున్న సుష్మ(26) కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకుంది. ఐదు నెలల క్రితం పులకుర్తి కెనరా బ్యాంక్ లో మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తితో వివాహం జరిగింది. అయితే అప్పటి నుండి తాను భర్త ఇంటికి రాకుండా తల్లిదండ్రులు దగ్గరే ఉంటూ ఉద్యోగం చేస్తూ ఉండేది. అటు అత్త మామా, భర్త దగ్గర ఉంటూ ఉద్యోగం చేయాలని చెప్పడంతో తనకు తల్లిదండ్రులును వదిలి వెళ్లడం ఇష్టం లేక ఇలాంటి ఆగాయిత్యంకు పాల్పడింది అంటూ కుటుంబీకులు తెలుపుతున్నారు. ఘటనపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.