సింగనమల కస్తూర్భా విద్యాలయంలో విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థత

సింగనమల కస్తూర్భా విద్యాలయంలో విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థత
క్యాపిటల్ వాయిస్ (అనంతపురం జిల్లా) సింగనమల :- కస్తూర్భా విద్యాలయంలో విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థతకు గురయ్యారు. సుమారు 80 మంది విద్యార్థులు కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడుతుండడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో 30 మంది పరిస్థితి కొంత విషమంగా ఉండడంతో
మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగతా 50 మంది విద్యార్థులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విద్యాలయంలో నిన్న సాయంత్రం అల్పాహారం తీసుకున్న అనంతరం ఫుడ్ పాయిజన్ అయిందని విద్యార్ధులు చెబుతున్నారు.శుక్రవారం మధ్యాహ్నం భోజనం తిన్న
వీరంతా ఒక్కొక్కరుగా వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. సాయంత్రానికి ఈ సంఖ్య 40కి చేరుకుంది. దీంతో పాఠశాల సిబ్బంది వెంటనే వారిని శింగనమల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం
అక్కడి నుంచి 8మందిని అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పాఠశాలలో మొత్తం 200 మంది విద్యార్థినులు ఉన్నారు. మధ్యాహ్నం వీరంతా పప్పు,అన్నం,రసం,మజ్జిగ తో భోజనం చేసినట్లు సిబ్బంది తెలిపారు.
విద్యార్ధులను ఎమ్మెల్యే పరామర్శించారు.అయితే మజ్జిగలో బల్లి పడినట్లు విద్యార్థినులు చెబుతున్నారు. అంతకుముందు పరామర్శకు వచ్చిన ఎమ్మెల్యే పద్మావతిని ఎస్ ఎఫ్ ఐ విద్యార్థి నేతలు అడ్డుకున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే పద్మావతి తో ఎస్ ఎఫ్ ఐ నేతలు వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని బలవంతంగా లాక్కెళ్లారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఎమ్మెల్యే ఆదేశించారు.