సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన ముదుండి రాజేశ్వరి.

సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన ముదుండి రాజేశ్వరి.
క్యాపిటల్ వాయిస్, విశాఖపట్నం ప్రతినిధి,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ దేవస్థానంలలో ఒకటైన విశాఖపట్నం సింహాచలం దేవస్థానం పాలక మండలిని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నియమించడమైనది, అందులో పాలక మండలి సభ్యులుగా పాత మధురవాడ ముదుండి రాజేశ్వరి కి అవకాశం కల్పించారు, గురువారం శ్రీ వరహా లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ మండపంలో పాలక మండలి సభ్యులు అందరితో తో దేవస్థానం ఇఓ సూర్యకళ ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది,
ఈ సందర్భంగా ముదుండి రాజేశ్వరి మాట్లాడుతూ నాకు సింహాచలం అప్పన్న స్వామి సేవ చేసే భాగ్యం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రివర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావుకి, ఉత్తరాంధ్ర ఇన్చార్జి వి. విజయసాయి రెడ్డికి, మిగతా ప్రజాప్రతినిధులకు, మధురవాడ ప్రాంత వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు కృతజ్ఞతలు తెలియజేశారు,
అనంతరం మాట్లాడుతూ సింహాచలం దేవస్థానం అభివృద్ధికి, అప్పన్న స్వామి దర్శనానికి విచ్చేసిన భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో పాలక మండలి సభ్యులు, ఆలయ అధికారులతో కలిసి పనిచేస్తానని తెలిపారు,
ఈ కార్యక్రమంలో మరియు వైస్సార్సీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.