Andhra PradeshPrakasham
సరోజినీ దేవి జాతీయ సేవ పురస్కారం అందుకున్న డాక్టర్ నజీమా బేగం

సరోజినీ దేవి జాతీయ సేవ పురస్కారం అందుకున్న డాక్టర్ నజీమా బేగం
క్యాపిటల్ వాయిస్, ఒంగోలు :- సరోజినీ దేవి జాతీయ సేవ పురస్కారం అందుకున్న డాక్టర్ నజీమా బేగం ఎందరికో ఆదర్శనీయమని సినీ యువ నటులు నరేష్ రాజ్ మరియు లక్కీ శ్రీ అన్నారు. హైదరాబాదులో జరిగిన లిటిల్ చాంప్స్ అకాడమీ ఆఫ్ ఇండియా స్వాతంత్ర విజయోత్సవ స్ఫూర్తి సేవ రత్న పురస్కార వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. గత పది సంవత్సరాలుగా డాక్టర్ నజీమా బేగం ఎంతోమంది అనాధలకు వృద్ధులకు మహిళలకు చేయూతనిస్తుందని అన్నారు. మానవ హక్కుల పరిరక్షణకు ఎవరికైనా ఇబ్బంది కలిగితే మానవ హక్కుల సంఘాన్ని సంప్రదిస్తే న్యాయం జరుగుతుందనే విషయాన్ని తెలియజేస్తూ ప్రజల అవగాహన కల్పించడంలో ఈమె చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. డాక్టర్ నజిమ బేగం చేసిన సేవలు గుర్తించి లిటిల్ ఛాన్స్ అకాడమీ ఆఫ్ ఇండియా సంస్థ సరోజినీ దేవి సేవ రత్నం పురస్కారంతో ఘనంగా సత్కరించడం అభినందనీయమన్నారు. మహిళలకు ఎంతో స్ఫూర్తిగా వారు నిలిచారని సమాజసేవ పట్ల ప్రతి ఒక్కరు ముందుకు రావాలి కొనియాడారు ఇటువంటి వ్యక్తులను సన్మానించడం ద్వారా ఎంతోమందికి అవార్డులు అందుకోవాలని ఆలోచన కూడా ఏర్పడుతుందని అన్నారు. తనకు పురస్కారం రావటం ఎంతో గర్వంగా ఉందని డాక్టర్ నజీమా బేగం అన్నారు.భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు తాను విస్తృతంగా చేస్తానని తెలిపారు. బాధలకు బాధలు హక్కుల పరిరక్షణకు తాను ఎప్పుడు అండగా నిలబడతానని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.