Andhra PradeshVijayanagaram
సంతాప తీర్మానం ప్రవేశపెట్టాలని ఆర్య వైశ్య సంఘాలు వినతి.

సంతాప తీర్మానం ప్రవేశపెట్టాలని ఆర్య వైశ్య సంఘాలు వినతి.
క్యాపిటల్ వాయిస్ (విజయనగరం జిల్లా) బొబ్బిలి :-
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు రాష్ట్ర గవర్నర్ మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖా మాత్యులు గా 16 సార్లు బడ్జెట్ అసెంబ్లీ లో ప్రవేశపెట్టిన మహోన్నత వ్యక్తి, ఇదియే కాక దివంగతనేత రాజశేఖర్ రెడ్డి కి అత్యంత ఆప్తులు అయినటువంటి కొణిజేటి రోశయ్య మృతి చెందిన తర్వాత అసెంబ్లీ లో సంతాప తీర్మానం ప్రవేశ పెట్టకపోవడం చాలా అన్యాయమని ఈ విషయం పై ఆర్య వైశ్య సంఘాలన్నీ నిరసన తెలియచేస్తూ మహాత్మా గాంధీ విగ్రహానికి నిరసన పత్రం అందచేశారు, ఇప్పటికయినా సంతాప తీర్మానం అసెంబ్లీ లో ప్రవేశ పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమం లో బొబ్బిలి మండల ఆర్య వైశ్యులు అందరూ పాల్గొన్నారు.