Andhra PradeshChittoor
సంక్రాంతికి కొత్త ముఖ్యమంత్రి రాబోతున్నారు: చింతా మోహన్

సంక్రాంతికి కొత్త ముఖ్యమంత్రి రాబోతున్నారు : చింతా మోహన్
క్యాపిటల్ వాయిస్, (చిత్తూరు జిల్లా) తిరుపతి:- ఏపీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆరోపించారు. శనివారం తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేదలకిచ్చే బియ్యాన్ని ప్రజాప్రతినిధులు 50శాతం పక్కదారి పట్టిస్తున్నారన్నారు. సీఎం కుర్చీ పోతుందన్న దిగులుతో జగన్ బయటకు రావడం లేదని, భోగి పండుగలోపు రాష్ట్రంలో నూతన ముఖ్యమంత్రి రాబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సినిమా టిక్కెట్లు విక్రయించడం అవసరమా అని ప్రశ్నించారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో, రాష్ట్రంలో ప్రత్యామ్నాయం అవసరమని, అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని అన్నారు. దీపావళిలోపు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అందరికీ ఆమోదయోగ్యమైన నాయకుడు ప్రతినిధిగా నియమితులవుతారని తెలిపారు.