Andhra Pradesh
సాంఘీక సమానత్వానికి ప్రతీక బ్రహ్మనాయుని చాపకూడు సిద్ధాంతం
పల్నాడు జిల్లా కలెక్టర్, ఎస్ పి, ఎం పి, ప్రభుత్వ విప్, మాచర్ల ఎం ఎల్ ఏ వెల్లడి

నేడు కోడిపోరు ( ప్రధాన ఘట్టం )
క్యాపిటల్ వాయిస్, కారంపూడి :- సాంఘీక సమానత్వానికి ప్రతీక బహ్మనాయుని చాపకూడు సిద్దాంతం అని పల్నాడు జిల్లా కలెక్టర్ లోతేటి శివ శంకర్ , ఎస్ పి రవి శంకర్ రెడ్డి , ఎం పి లావు కృష్ణదేవరాయలు , ప్రభుత్వ విప్, మాచర్ల ఎం ఎల్ ఏ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి లు వెల్లడించారు. పల్నాటి వీరారాధన ఉత్సవాల్లో 3వ రోజైన మందపోరు రోజున అనాదిగా వస్తున్న చాపకూడు సిద్దాంతాన్ని వీరాలయ ప్రాంగణంలో పీఠాధిపతి పిడుగు తరుణ్ చెన్నకేశవ అయ్యవారు ప్రత్యెక పూజలతో ఈ మహత్తర కార్యం ప్రారంభమైంది. మాచర్ల నియోజకవర్గం ఎం ఎల్ ఏ, ప్రభుత్వ విప్ మాచర్ల ఎం ఎల్ ఏ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, వై ఎస్ ఆర్ సి పి రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకట రామిరెడ్డి ల ఆధ్వర్యంలో స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు అత్యంత ఘనంగా ఏర్పాట్లు గావించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిధిగా పాల్గొన్న పల్నాడు జిల్లా కలెక్టర్ లోతేటి శివ శంకర్ మాట్లాడుతూ కుల,మత జాతి వైషమ్యాలకు తావు లేకుండా జరిగే మహత్తర కార్యక్రమం చాపకూడు సిద్దాంతం అని ఆయన కొనియాడారు. చాపకూడు కార్యక్రమానికి చక్కని ఏర్పాట్లు చేసిన ఎం ఎల్ ఏ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి కి కలెక్టర్ అబినందనలు తెలిపారు. పల్నాడులో కక్ష్యలు కర్పన్యాలే కాకుండా అన్ని కులాల సాంఘీక సమానత్వం కోసం బ్రహ్మనాయుడు ప్రారంభించిన చాపకూడు సిద్దాంతం నేటికి ఎంతో ఆదర్శనీయం అని పల్నాడు జిల్లా ఎస్ పి రవి శంకర్ రెడ్డి
అన్నారు. కులమతాలకతీతంగా, వర్ణభేదం లేకుండా జరిగే మహత్తర కార్యక్రమం చాపకూడు అని నరసరావుపేట

ఎం పి లావు కృష్ణ దేవరాయలు పేర్కొన్నారు. శతాబ్దాల చరిత్ర కలిగిన పల్నాటి వీరారాధన ఉత్సవాల ఖ్యాతిని
విస్తరింపచేయుటకు తమ వంతుగా కృషి చేస్తున్నామని ఎం ఎల్ ఏ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు.
వీరాలయంలో ప్రత్యేక పూజలు ….. పల్నాడు జిల్లా కలెక్టర్, ఎస్ పి, ఎంపి, ప్రభుత్వ విప్, మాచర్ల ఎం ఎల్ ఏ పిన్నెల్లి, జిల్లా పరిషత్ సిఈఓ శ్రీనివాస రెడ్డి ప్రత్యెక పూజలు నిర్వహించారు. పల్నాటి రాజ్య సర్వసైన్యాధ్యక్షుడు, బ్రహ్మనాయుడు దత్త పుత్రుడు కన్నమదాసు భైరవ ఖడ్గం, డాలును కలెక్టర్ చేతబూనారు.
చాపకూడు సహపంక్తి లో అధికారగణం, ప్రజాప్రతినిధులు …..కులమత భేదాలు లేకుండా అందరూ కలిసి భోజనం చేయాలనే బ్రహ్మనాయుడు చాపకూడు ను అధికారగణం, ప్రజాప్రతినిధులతో కలిసి ఎం ఎల్ ఏ, ఎంపి, కలెక్టర్,ఎస్ పి సహపంక్తి బోజనాలు చేశారు.

అతిదులకు ఎం ఎల్ ఏ ఘన సత్కారం ……… వీరారాధన ఉత్సవాల్లో పాల్గొన్న ఎంపి కృష్ణ దేవరాయలు, కలెక్టర్ శివ శంకర్, ఎస్ పి రవి శంకర్ రెడ్డి లను ఎం ఎల్ ఏ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి పూలమాలలు వేసి దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు.
ప్రత్యెక బందో బస్తు ఏర్పాట్లు ….పల్నాటి వీరారాధన ఉత్సవాలలో పాల్గొనే భక్తులకు, వీరాచారవంతులకు,ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా ఎస్ పి రవి శంకర్ రెడ్డి ఆదేశాల మేరకు గురజాల డి ఎస్ పి జయరాం ప్రసాద్ ఆధ్వరంలో కారంపూడి సి ఐ జయ కుమార్ పర్యవేక్షణలో ప్రత్యెక బందో బస్తును నిర్వహిస్తున్నట్లు కారంపూడి ఎస్ ఐ రామాంజనేయులు తెలిపారు. ఆలయాల వద్ద భక్తుల తాకిడి దృష్ట్యా ప్రత్యెక బారికేడ్లను ఏర్పాటు చేసి స్వామి వారి దర్శన ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని అన్నారు. అదే విధంగా అన్ని ఆలయాల వద్ద, కూడలిలలో పోలీసు బందో బస్తును నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సిఈఓ శ్రీనివాసరెడ్డి, గురజాల డి ఎస్ పి జయరాం ప్రసాద్, కారంపూడి సి ఐ జయ కుమార్, తాసిల్దార్ శ్రీనివాస యాదవ్. ఎం పి డి ఓ జి శ్రీనివాసరెడ్డి, కారంపూడి ఎస్ ఐ రామాంజనేయులు, పి హెచ్ సి వైద్యాధికారి బి దుర్గారావు, తదితర అధికారులతో పాటు ఎం పి పి మేకల శారదా శ్రీనివాస్ రెడ్డి, జెడ్ పి టి సి షేక్ షపి, సర్పంచ్ ప్రమీల బాయి తేజా నాయక్, ఎం పి టి సి లు వేముల లింగయ్య, ఆరీఫ్, వైసిపి నాయకులు షేక్ అక్బర్, బొమ్మిన అల్లయ్య, మాజీ ఎం పి పి పంగులూరి చిన వెంకట నర్సయ్య, చిలుకూరి చంద్ర శేఖర్ రెడ్డి, కొంగర సుబ్రహ్మణ్యం, కొమ్ము చంద్ర శేఖర్, అంతరగడ్డ ఏసోబు, చల్ల ప్రసాద్, పాతూరి రామిరెడ్డి, గాడిపర్తి పూర్ణయ్య, ఆశం విజయభాస్కర్ రెడ్డి, సూరే అంకారావు, గుండా శ్రీను, చీతిరాల కోటేశ్వర రావు, భవిరిశెట్టి రామారావు తదితర నాయకులు, వీరారాధన ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
నేడు కోడి పోరు …..పల్నాటి వీరారాధన ఉత్సవాలలో నాలుగవ రోజైన కోడిపోరు ఘట్టం శనివారం వీరాలయ ప్రాంగణంలో రసవత్తరంగా జరుగనుంది. పల్నాటి పౌరుషానికి ప్రతీకగా చెప్పుకునే ఈ ఘట్టాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున వీరాచారవంతులు, భక్తులు,ప్రజలు తరలివస్తారు. బ్రహ్మనాయుడు వేషధారణలో వీరాచార పీఠాధిపతి తరుణ్ చెన్నకేశవ అయ్యవార్ అలనాటి చారిత్రక కధనంగా రతనాల చిట్టి మల్లును అనే కోడిని చేతబూనగా, నాయకురాలు నాగమ్మ వేషధారణలో వీరచారవంతులు శివంగి డేగ అనే కోడిని పోరుకు ఉసిగోల్పుతారు. ఈ చారిత్రక సన్నివేశాలను తిలకించేందుకు పలు ఒక్కరు ఆసక్తి చూపిస్తారు.