సచివాలయ వి ఆర్ ఓ ల బారినుండి మీసేవ ఆపరేటర్ల ను కాపాడండి.జేసీ విశ్వనాతన్ కి వినతి.

సచివాలయ వి ఆర్ ఓ ల బారినుండి మీసేవ ఆపరేటర్ల ను కాపాడండి.జేసీ విశ్వనాతన్ కి వినతి.
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి.
విశాఖపట్నం జిల్లా మీసేవ ఆపరేటర్స్ అందరు కలెక్టర్ కార్యాలయంలో మా మీసేవ సెంటర్ లలో దరఖాస్తు చేయబడిన దరఖాస్తులను కూడా అంగీకరించమని జాయింట్ కలెక్టర్ విశ్వనాధన్ కి వినతి పత్రం ఇచ్చి విజ్ఞప్తి చేసారు. మేము గత 20 ఏళ్ళనుండి అప్పటి ముఖ్యమంత్రి వర్యులు అయిన వై ఎస్ రాజశేఖర్ రెడ్డి నిరుద్యోగులకు కోసం ప్రవేసపెట్టిన మీసేవ ను రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశాలకు అనుగుణంగా నడుపుచు, రాష్ట్ర ప్రజలకు ఎన్నో సేవలను అందిస్తున్నాం.రాష్ట్రమంతటా సుమారుగా 10000 ఆపరేటర్లు , లక్షకు పైగా మీ సేవ కుటుంబాల ప్రజలు దీనిమీద ఆధారపడి జీవనం సాగిస్తున్నాం. మేము ఉదయం 7 గంటలు నుండి రాత్రి 10 గంటలకు వరకు మా మీసేవ సెంటర్స్ తెరిచి వుంచి ప్రజలకు అన్నిరకముల సేవలను అందిస్తున్నాం. సెలవు దినములలో కూడా మేము ఇదే సమయం లలో మేము పనిచేస్తూ మా జీవనం సాగిన్స్తున్నాం.ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గ్రామ, వార్డ్ సచివాలయం లలో మీసేవ సర్వీసులు అన్ని అందించు చున్నారు. మీసేవ ఆపరేటర్లు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ వారికి మేము ప్రభుత్వానికి అధికారులకు వ్యతిరేకం కాదని మేము జగన్ ప్రభుత్వం రావాలని కోరుకున్నవారిమె మీ ఆశయ సాధనకు కృషిచేస్తామని విన్నవించగా,మన ముఖ్యమంత్రి వర్యులు అయిన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నవరత్నములలో భాగం అయినది కాబట్టి, మీసేవ లు కూడా సచివాయలం కు సమాంతరం గా నడుపుకొనుటకు అవకాశం కల్పించటంతో మా కుటుంబాలను పోషించుకు వన్తున్నాం. కాని ఇప్పుడు గత 3 వారంల బట్టి అన్ని సచివాలయం లో పనిచేస్తున్న వి ఆర్ ఓ లు, అడ్మిన్ లు, మా మీసేవ నుండి దరఖాస్తు చేసుకొన్న వాటిని అంగీకరించక, దరఖాస్తులను రద్దు చేస్తున్నారు. రద్దు చేసి ప్రజలను భయ బ్రాంతులకు గురిచేసి వారితో మళ్ళీ సచివాలయం లో కొత్తగా దరఖాస్తు చేస్తూ ప్రజలకు అదనపుతో అదనపు ఖర్చు చేయిస్తున్నారు.మీసేవ ఆపరేటర్లు వెళ్లి సచివాలయం సిబ్బందిని ఎందుకు రద్దు చేస్తున్నారని ఆడగ గా మీసేవ లో దరఖాస్థులు చేయటం వల్ల సచివాలయాలకు ప్రజలు రావటం లేదు మీరు దరఖాస్థులు చెయ్యటానికి వీలు లేదు అని సమాధానం ఇస్తున్నారని వాపోయారు. మీసేవలో దరఖాస్థు చేసిన దరఖాస్తులను తీసుకు వెళ్లిన ప్రజలను మీసేవలో దరఖాస్థు ఎందుకు చేస్తున్నారు అన్ని సచివాలయం లో మాత్రమె దరఖాస్తు చేసుకోనవలయిను అని , మీ సేవ లో దరఖాస్తు చేసినచో రద్దు చేయబడును అని ,ప్రజలకు సంక్షేమ పధకాలు అందవని ప్రజలతో దురుసుగా చెప్తూ వారిని భయ బ్రాంతులకు గురిచేయ్యటంతో వారు తిరిగి మీసేవ సెంటర్ కి వచ్చి ఆపరేటర్లతో వాగ్వాధానికి దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.ఈ పరిస్తితి వలన మా మీసేవ మనుగడకు ఇబ్బంది ఏర్పడుతుంది.మా లక్షమంది జీవనోపాది అయిన మీసేవ ను మూసి మేము ఇప్పుడు వేరే జీవనోపాది కి మారే పరిస్తితిలో లేము. కావున దయవుంచి మా యి విన్నపం ను అర్ధం చేసుకొని సచివాలయం లతో పాటుగా మా మీసేవ సెంటర్ల లో దరఖాస్తు చేయబడిన దరఖాస్తులను కూడా అంగీకరించవలిసిందిగా ప్రాధేయపడుతున్నాము.తద్వారా లక్షమంది కి పైగా జీవనోపాధి కోల్పుకుండా మీరు తగు చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నాము అని విజ్ఞప్తి చేసారు.మీసేవ ఆపరేటర్ల విజ్ఞప్తి కి జె సి విశ్వనాతన్ శానుకూలంగా స్పందించి మీసేవల పై తప్పుడు ఆదేశాలు ప్రభుత్వం కానీ, అధికారులు కానీ ఎక్కడ ఇవ్వలేదు మీసేవ సర్వీస్ లు మీసేవ లోను, గ్రామ వార్డ్ సచివాలయాలలోనూ ప్రజలకు ఎక్కడ అందుబాటులో ఉంటే చేసుకోవచ్చని సచివాలయం లోనే చెయ్యాలని ఏ అధికారులు చెప్పరని ఎవరైనా ఆలా చెప్పినట్టు అయితే వారిపై చర్య తీసుకుంటానని మీసేవ ఆపరేటర్లకు భరోసా ఇచ్చారు.మీసేవలో ఆన్లైన్ అప్లోడ్ చేసిన దరఖాస్తులను ఏ తహసీల్దార్ ఇవ్వమని చెప్పారని ఎదురు మీసేవ ఆపరేటర్లను ప్రశ్నించి అక్కడే మీసేవ తప్పు జరుగుతుంది మీరు మధ్య వర్థులను ప్రోత్సహించకుండా మీరు సరైన దరఖాస్తు చేసిన దరఖాస్తు అప్లోడ్ చేసినప్పుడు ఫిజికల్ దరఖాస్థు ఎక్కడ ఇవ్వనవసరం లేదు అది మీరు మధ్యవర్థులను ప్రోత్సహించకుండా నిర్మూలించండి అని ఆదేశాలిస్తూ, ఆన్లైన్ అప్లోడ్ చేసిన దరఖాస్తు ఏ అధికారైనా ఫిజికల్ కాపీ అడిగినట్లయితే నా దృష్టికి తీసుకురండి నేను అధికారులపై చర్య తీసుకుంటానని తెలిపారు.ఈ కార్యక్రమంలో మీసేవ అసోసియేషన్ సభ్యులు, నాగు, శ్రీనివాస్, శ్రీహరి, సాయి, భవాని తదితరులు పాల్గొన్నారు.