ఋషికొండ పర్యటనకు వెళ్తున్న టీడీపీ నేతలను అడ్డుకుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలింపు.

ఋషికొండ పర్యటనకు వెళ్తున్న టీడీపీ నేతలను అడ్డుకుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలింపు.
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా ఋషికొండపై మొక్కలు నాటి పర్యావరణం పరిరక్షణ అవగాహన కార్యక్రమంలో ఋషికొండ జంక్షన్ వద్ద పోలీసులు అడ్డుకోవటంతో టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా పర్యావరణాన్ని కాపడాలని రేపటి తరానికి తెలియచేయాలని ఈ ప్రభుత్వం పర్యావరణాన్ని కాపాడవలసింది పోయి కొండలకు బోడిగుండు కొట్టి దోచుకుంటుందో ప్రజలకు తెలియచేయాలని సుప్రీం కోర్ట్ ఋషికొండపై ఇచ్చిన ఆదేశాలకు సుప్రీం కోర్ట్ తప్పుడు నివేదికలు ఇవ్వటం తప్పు అని నిరూపించే ప్రయత్నం, పర్యావరణ దినోత్సవం రోజున కొన్ని మొక్కలను నాటి ప్రశాంత గా నినాదాలు తెలిపి వెళ్ళటానికే వచ్చామని ప్రజాస్వామ్య దేశంలో ఋషికొండ పోలీస్ సబ్స్టేషన్ వద్ద టీడీపీ నాయకులను అడ్డుకోవటం తగదు అని అన్నారు.ఋషికొండ జంక్షన్ వద్దే రోడ్డుబైటాయించి ఋషికొండను, వైజాగ్ ను కాపడాలి అని నినాదించారు. పోలీసులు ఎంత చెప్పిన వెళ్లకపోవటంతో టీడీపీ నాయకులను ఏ సి పి చుక్కా శ్రీనివాస్ ఆధ్వర్యంలో సి ఐ అడబాల రవి కుమార్ అరెస్ట్ చేసి పి ఎమ్ పాలెం పోలీస్ స్టేషన్ కి తరలించారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ, భీమిలి నియోజకవర్గం ఇంచార్జ్ కోరాడ రాజబాబు, దక్షిణ నియోజకవర్గం ఇంచార్జ్ గండి బాబ్జి, మహిళా నాయకులు అనంతలక్ష్మి, బోయ రమాదేవి,రాష్ట్ర బి సి సెల్ ఉపాధ్యక్షులు, గొల్లంగి ఆనందబాబు, వాండ్రాసి అప్పలరాజు, ఈగల రవి, నాగోతి సత్యనారాయణ,తదితరులు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.