Andhra PradeshEast godavari
రన్నింగ్ లో ఉండగా ఊడిన ఆర్టీసీ బస్సు చక్రాలు…ప్రయాణికులు హడల్

రన్నింగ్ లో ఉండగా ఊడిన ఆర్టీసీ బస్సు చక్రాలు…ప్రయాణికులు హడల్
క్యాపిటల్ వాయిస్, (తూర్పుగోదావరి జిల్లా) వైరామవరం :- బస్సు రన్నింగ్ లో ఉండగా షాకింగ్ ఘటన జరిగింది. ఒక్కసారిగా బస్సు కుంగిపోవడం తో ఏం జరిగిందో అర్థం కాక ప్రయాణికులు హడలిపోయారు.ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా, వైరామవరం తృటిలో పెను ప్రమాదం తప్పింది.గోకవరం నుంచి పాతకోట వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సు చక్రాలు రన్నింగ్ లో ఉండగానే ఒక్కసారిగా ఊడిపోయాయి.చాసిస్ తో సహా చక్రాలు ఉడిపోవడంతో బస్సు ఒక్కసారిగా కుంగింది.అప్రమత్తంగా వ్యవహరించిన బస్సు డ్రైవర్ ఇంజన్ ఆఫ్ చేయడంతో ప్రాణాపాయం తప్పింది.ప్రమాదంలో ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.ఈ ఘటనతో ఆర్టీసీ బస్సుల ఫిట్ నెస్ పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.కాలం చెల్లిన బస్సులకు స్వస్తి చెప్పి నూతన బస్సులను ఏర్పాటు చేసి ప్రయాణికుల భవిష్యత్తును కాపాడాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుచున్నారు.