
మాజీ ఐపీఎస్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ బీఎస్పీలో చేరిక
క్యాపిటల్ వాయిస్,తెలంగాణ (నల్లగొండ జిల్లా) :- నల్లగొండ జిల్లా కేంద్రం నీలిమయమైంది మాజీ ఐపీఎస్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ బీఎస్పీలో చేరిక సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రమంతా కోలాహలంగా మారింది.
రాష్ట్రం నలుమూలల నుంచి బీఎస్పీ కార్యకర్తలతో పాటు ప్రవీణ్‌కుమార్ అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.నిన్న సాయంత్రం మర్రిగూడ బైపాస్‌కు చేరుకున్న ప్రవీణ్‌కుమార్ అక్కడే అంబేద్కర్, జగ్జీవన్‌రావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం భారీ ర్యాలీతో సభా ప్రాంగణానికి బయలుదేరారు ర్యాలీలో బోనాలతో పాటు పలు ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.కొమ్ము డప్పులతో పాటు డప్పుచప్పుళ్లు, వాయిద్య కళాకారులు, నృత్య కళాకారులు ప్రదర్శనలతో ర్యాలీగా ముందుకు సాగారు.ర్యాలీ ఆసాంతం ప్రవీణ్‌కుమార్ ఓపెన్ టాప్ వాహనంలో నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ ఉత్సాహంగా సాగారు.
ఓయూ నుంచి విద్యార్థులు పాదయాత్రతో వచ్చి ప్రత్యేకంగా నీలిరంగు దుస్తులు ధరించి పాదయాత్రలో ముందుకు సాగడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.