రోడ్ల మరమ్మతులు మీరు చేయకుంటే మేమే చేస్తాం

రోడ్ల మరమ్మతులు మీరు చేయకుంటే మేమే చేస్తాం
క్యాపిటల్ వాయిస్, (గుంటూరు జిల్లా) కారంపూడి :- ఏపీలో అడుగుకో గుంత గజానికి ఒక గొయ్యి అనే కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు గుంటూరు జిల్లా కారంపూడి పట్టణ మరియు మండల పరిధిలోని జనసేన ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో కారంపూడి పట్టణంలోని అద్వన స్థితిలో ఉన్న రోడ్ల గుంతలు మరియు డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా బాగుచేయాలని లేకుంటే తామే సొంతంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో మరమ్మతులు చేసి తమ ప్రతిభ ప్రస్తుత ప్రభుత్వానికి చూపిస్తామని స్వచ్ఛ గ్రామం స్వచ్ఛ మండలం అంటే ఎలా ఉంటుందో ప్రతి సైనికుడు నిరంతరం కృషి తో త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి చూపిస్తామని తమ నాయకుడు నిరంతరం కృషివలుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ప్రతి గ్రామంలో అద్వాన స్థితిలో ఉన్న ప్రతి రోడ్డుకి అధికారులు నాయకులు వెనువెంటనే మరమ్మతులు పూర్తిగా బాగలేని చోట శాశ్వత రోడ్లు నిర్వహించాలని అలా చేయకుంటే జనసేన సేవకుల ఆధ్వర్యంలో తామే సొంతంగా రోడ్ల గుంతలు మరియు మరమ్మతులు నిర్వహించాలి అనే తమ అధినాయకుడు పిలుపు మేరకు ప్రతి ఒక్క జన సైనికుడు కదిలివస్తున్నారని రానున్న రోజుల్లో సమస్యకి ప్రజల తరఫున ప్రతి సమస్యకె నిలబడి పోరాడతామని ప్రజా క్షేమం మే తమ క్షేమమని నమ్మిన జనసేన నాయకుడికి నిరంతరం శ్రమిస్తూ ప్రజాసేవకులుగా ఉండిపోతామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కేసనపల్లి కృష్ణ రామాంజనేయులు, మల్లికార్జున రావు, సారధి బ్రహ్మనాయుడు, లక్ష్మయ్య, సైదారావు, అనిల్ కుమార్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు