Andhra PradeshKurnool

రియల్ సింగంలా కర్నూలు ఎస్పీ…సి.ఎం అండదండలు ఉన్నాయనేనా… !?

రియల్ సింగంలా కర్నూలు ఎస్పీ…సి.ఎం అండదండలు ఉన్నాయనేనా… !?

క్యాపిటల్ వాయిస్, (కర్నూలు జిల్లా) :- సాధారణంగా అధికార పార్టీ నేతలంటే పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తాన్న ప్రచారముంది. వాళ్ల జోలికి వెళ్తే ఎందుకొచ్చిన తలనొప్పి అని పోలీసులు కూడా భావిస్తుంటారు. కానీ ఓ పోలీస్ అధికారి మాత్రం రియల్ సింగంలా మారారు. ఆ పార్టీ, ఈ పార్టీ అని లేదు. తప్పు చేస్తే చాలు లోపలేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. అంతేకాదు అవినీతి పరులకు సహకరిస్తున్న పోలీసులను వదిలిపెట్టడం లేదనే టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారిన ఆ అధికారే కర్నూలు జిల్లా  కొత్త ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి. కొద్దిరోజుల క్రితం కర్ణాటక  క్యాడర్ కు చెందిన సుధీర్ కుమార్ రెడ్డి కర్నూలు ఎస్పీ గా నియమితులయ్యారు. ముక్కుసూటిగా వెళ్లే అధికారి కావడం, అందులోనూ నేరస్థులపై కఠినంగా వ్యవహరిస్తారనే ప్రచారం ఇటు సోషల్ మీడియాలోనూ అటు వార్తల్లోనూ విస్తృతంగా ప్రచారం సాగింది.రాజకీయ ఒత్తిడిలు అసలు కేర్ చేయని నిఖార్సైన ఎస్పీగా పేరొందారు సుధీర్ కుమార్ రెడ్డి. అయితే ఆయనను కర్నూలు జిల్లా ఎస్పీగా నియమించారని తెలియగానే, ఎవరి సిపార్సు పై డెప్యూటేషన్ మీద వచ్చారో అరా తీసారట అధికార పార్టీ నేతలు. అంతే కాదు రాజకీయ నాయకుల అనుచరులు మట్కా, పేకాట శిబిరాల నిర్వాహకులు ఇదేం దౌర్భాగ్యంరా బాబోయ్ అంటూ రాగాలు తీసారట.ఊరు వాడ చక్క దిద్దాలంటే ముందు మన ఇల్లు పరిశ్రుభ్రంగా ఉండాలని భావించారో ఏమో గాని, నేరస్థులకన్నా ముందే పోలీస్ వ్యవస్థను గదిలో పెట్టె ప్రయత్నం చేశారాయన. నేరస్థులకు, అధికార పార్టీ నేతలకు సహకారం అందిస్తున్న పలువురు పోలీస్ అధికారుల్లో మార్పు తెచ్చే ప్రయత్నాన్ని ప్రారంభించారు. ముల్లును ముల్లుతోనే తీయాలన్న సామెతను నిజం చేస్తూ ప్రక్షాళన దిశగా చర్యలు చేపట్టారు. అవాంఛనీయ., చట్టవ్యతిరేక కార్యక్రమాలు చేపట్టే వారికి అండగా ఉన్న పోలీస్ వారి చిట్టాలు బయటకు తీశారని సమాచారం. తనకు వచ్చిన ఇన్ పుట్స్ ద్వారా ఓ జాబితాను తాయారు చేశారట ఎస్పీ. అయన రూపొందించిన జాభితా ప్రకారం ముగ్గురు ఎస్సైలు, ముగ్గురు ఏఎస్సైలు, పలువురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. ఇలాగే 32 మందిని బదిలీ కూడా చేశార. జిల్లాలో ఏ మండలాన్ని వదలకుండా దాదాపు అన్ని పోలీస్ స్టేషన్లలోనూ బదిలీలు జరిగాయి.ఇక ఎస్పీ దగ్గర ఉన్న లిస్ట్ ప్రకారం మట్కా., గుట్కా, పేకాట స్థావరాళ్లలో సంబంధమున్నవారిని ఏ మాత్రం ఆలోచించకుండా సస్పెండ్ లేదా ట్రాన్స్ ఫర్ చేస్తున్నారు. దీంతో ఆయా స్టేషన్లో విధులు నిర్వహించే ఉన్నతాధికారుల నుంచి కానిస్టేబుల్స్ వరకు అందరి గుండెల్లో గుబులు మొదలైంది. ఇన్నాళ్లు నేతల అండదండలతో నడిచిన కొందరు పోలీసులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. ఎస్పీ సుధీర్ రెడ్డి గురించి తెలిసిర నేతలు ఆయన వైపు వెళ్లే సాహసం చేయడం లేదు. ఆయనకు చెప్పినా వినడు, ఇపుడు పరిస్థితి బాగా లేదు, ఏమి చేయలేమని తమ నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారట. బడా నాయకుల పరిస్థితే ఇలా ఉంటే నియోజకవర్గ నాయకులు, ద్వితీయశ్రేణి నాయకులకు చుక్కలు కదపడుతున్నాయని వినికిడి. కార్యకర్తలు నేరుగా తమ నాయకులను కలసి పోలీస్ స్టేషన్లలో తమ మాట వినడం లేదని వాపోతున్నారట. అనుచరులకు  సమాధానం చెప్పలేక, ఎస్పీకి చెప్పలేక ప్రజాప్రతినిధులు మథనపడుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అని.. ఒళ్లు దగ్గరపెట్టుకొని వ్యవహరించాలని కార్యకర్తలకు హితవుపలుకుతున్నారట. ఇప్పుడున్న సమస్యలే చాలు లేనిపోని తంటాలు తెచ్చుకోకండని అనుచరులకు చెప్పేస్తున్నారట.మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అయితే ఏకంగా, ప్రెస్ మీట్ పెట్టి మరీ తన అనుచరులకు వార్నింగ్‌ ఇచ్చారట. మట్కా, గుట్కా, అక్రమ మద్యం, రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడవద్దని కార్యకర్తలను హెచ్చరించారు ఎమ్మెల్యే. ఇలాంటి చర్యలను ఎస్పీ సహించరని కార్యకర్తలను బహిరంగంగానే హెచ్చరించారు. మనమే ఆయన దారిలో వెళ్లాలని స్పష్టం చేశారు. ఇప్పటికి ఎవరైనా ఇలాంటి అక్రమ వ్యాపారులు చేస్తుంటే మానుకోవాలని, పోలీసులు పట్టుకుంటే మమ్మల్ని ఫోన్ చేసి సతాయించవద్దని తేల్చిచెప్పారు.ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి పూర్తి సహకారం ఉందని.. అందుకే నేతలు కూడా ఆయన్ని ఎదురించే ధైర్యం చేయడం లేదనే చర్చ కూడా జిల్లా రాజకీయాల్లో జరుగుతోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!