Andhra PradeshVisakhapatnam
రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలి

రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలి
క్యాపిటల్ వాయిస్, విశాఖపట్నం ప్రతినిధి :- టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు గుత్తులపుట్టు లో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో ధర్నా నిరసనలుచేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోవిడ్ నేపథ్యంలో ఉపాధి లేక అల్లాడుతున్న ప్రజలపై మరిన్ని భారాలు మోపుతోందని నోటి అందన కూడు ని తిరిగి లాగుకొనే విధంగా ప్రభుత్వం వ్యవరిస్తుంది అని నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరుగుతాయన్నారు. మోడీ హయాంలో ఎన్నడూ లేనంతగా ధరలు పెరిగాయని, ధరలను అదుపు చేయకుంటే మరింత ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం టిడిపి యువ నాయకులు కోడా వెంకట సురేష్ కుమార్. మాజీ ఎంపిటిసి సాగేని బొంజు పడాల్, కొంతిలి వెంకటప్రసాద్, బాలరాజు, బాడ్నాయిని కోటి బాబు, వంతాల పుష్ప, శ్రీను లువ్వబు,సాగేని యశోధమ్మ మరియ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
Attachments area