రాష్ట్ర డిజిపి వైఫల్యం వల్లే మహిళలకు రక్షణ కరువు : అబ్దుల్ అజీజ్

రాష్ట్ర డిజిపి వైఫల్యం వల్లే మహిళలకు రక్షణ కరువు : అబ్దుల్ అజీజ్
క్యాపిటల్ వాయిస్ జిల్లా ప్రతినిధి, నెల్లూరు :- రాష్ట్ర డిజిపి వైఫల్యం వల్లే రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని టిడిపి పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ తెలిపారు. గుంటూరులో హత్యకు గురైన దళిత విద్యార్థిని రమ్యను పరామర్శించడానికి వెళ్లిన టిడిపి జాతీయ అధ్యక్షులు లోకేషన్ అక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ సోమవారం నెల్లూరు నగరంలోని వి అర్ సి సెంటర్ లో ధర్నా నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవం రోజున గుంటూరులో దళిత మహిళ హత్యకు గురవడం సిగ్గుచేటన్నారు .రాష్ట్ర ప్రభుత్వం వెంటనే హత్యకు గురైన కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్గ్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు .రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని హత్యచేసిన నిందితుడిని వెంటనే ఉరి శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. దళిత నాయకులు పై చేయి చేసుకున్న ఎస్పీని వెంటనే విధుల నుంచి తొలగించాలని తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రతిరోజు మహిళ హత్యకు గురవుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిశా చట్టాన్ని మడచి పెట్టుకోవాలని అన్నారు .హత్యకు గురైన కుటుంబాన్ని పరామర్శించడానికి లోకేష్ వెళ్తే ముఖ్యమంత్రి హోంమంత్రికి బాధ ఏమిటో అర్థం కావడం లేదన్నారు. రాష్ట్ర డిజిపి వచ్చినప్పటినుండి రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైంది అన్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి సిటీ ఇన్చార్జ్ శ్రీనివాస్ రెడ్డి, టిడిపి నాయకులు జిల్లా అధికార ప్రతినిధి సంపత్ యాదవ్, జెన్ని రమణయ్య, రేవతి దేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.