Andhra PradeshGuntur
రామకృష్ణ పురం బాలికల గురుకుల పాఠశాలలో దారుణం !

రామకృష్ణ పురం బాలికల గురుకుల పాఠశాలలో దారుణం !
క్యాపిటల్ వాయిస్, సత్తెనపల్లి :- సత్తెనపల్లి మండలం రామకృష్ణా పురం లో గల గురుకుల పాఠశాలలో సోమవారం (నేడు) విద్యార్దినుల అల్పాహారంలో ఫుడ్ పాయిజన్ జరిగి 100 బాలికలకు తీవ్ర అస్వస్థత జరిగినట్లుగా విద్యార్ధినుల తల్లితండ్రులు చెప్తున్నారు. ఈ సంఘటనతో జ్వరం,విరేచనాలతో ఇబ్బంది పడి సృహతప్పి పడిపోయిన కొందరు విద్యార్థులు. వారిని వైధ్యచర్యాల నిమిత్తం హుటాహుటిన సత్తెనపల్లి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. త్వరితగతిన చికిత్స అందిస్తున్న వైద్య బృందం, అందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు. కొద్దిసేపట్లో వారిని పరమర్శించనున్న మంత్రి విడదల రజిని, మంత్రి, సత్తెనపల్లి శాసనసభ్యుడు అంబటి రాంబాబు.